కమర్శియల్ కంటే కంటెంట్ కే పెద్ద పీట వేసిన భామ!
టాలీవుడ్ లో రాశీఖన్నా కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `ఊహలు గుస గుసలాడే` నుంచి `థాంక్యూ` వరకూ తెలుగులో చాలా సినిమాలే చేసింది.
By: Tupaki Desk | 30 Jan 2025 11:30 PM GMTటాలీవుడ్ లో రాశీఖన్నా కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `ఊహలు గుస గుసలాడే` నుంచి `థాంక్యూ` వరకూ తెలుగులో చాలా సినిమాలే చేసింది. కానీ నటిగా మాత్రం అమ్మడి స్టార్ లీగ్ లో చేరలేకపోయింది. అందం, అభినయంతో అవకాశాలు అందుకున్నా సక్సెస్ లు ఆశించిన విధంగా రాకపోవడంతో రేసులో వెనుకబడింది. దీంతో కొంత కాలంగా తమిళ, హిందీ చిత్రాలపైనే ఫోకస్ పెట్టి పని చేస్తోంది.
ఇటీవలే `సబర్మతి రిపోర్ట్`, `ఆరణ్మనై 4` లాంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం నటిగా ఆ రెండు భాషల్లోనూ బిజీగానే కనిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో వచ్చిన అనుభవంతో తమిళ, హిందీ చిత్రాల్లో తెలివైన నిర్ణయాలతో ముందుకెళ్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని గుర్తు చేసింది. `ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించాను. ఒకే రకమైన సినిమాలు చేస్తే అవి పెద్దగా కిక్ ఇవ్వవు.
వ్యక్తిగతంగా నేను కమర్శియల్ చిత్రాలు ఇష్టపడతా. కానీ ఈ సినిమాల కంటే కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేస్తేనే మంచి పేరొస్తుంది. అద్భుతమైన నటిగా ఎదగాలంటే ఆ తరహా చిత్రాలే చేయాలి. కెరీర్ ని ముందుకు నడిపించేవి అవే. కమర్శియల్ చిత్రాలు చేయడానికి కొంత సమయం కేటాయించాలి. వాటి కంటే ముందుగా కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేసి నిరూపించుకుంటే నటిగా మంచి భవిష్యత్ ఉంటుంది` అని తెలిపింది.
మొత్తానికి అమ్మడు ఆలస్యమైనా వాస్తవాన్ని గ్రహించింది. కమర్శియల్ చిత్రాల్లో నాలుగు పాటలకు...రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితమవ్వాల్సి ఉంటుంది. నటిగా ఎదగడానికి స్కోప్ ఉండే చిత్రాలు కావవి. అయితే రాశీఖన్నా తెలుగులో కమర్శియల్ చిత్రాలు చేసింది తక్కువే. కానీ ఇక్కడ ఆడియన్స్ ని అందంతో మెప్పిం చినంతగా నటిగా మెప్పించలేకపోయింది.