రాశీఖన్నాకి హీరోల్ని దేవుళ్లు చేయడం ఇష్టం లేదా!
రాశీఖన్నా టాలీవుడ్ లో నటిగా రాణించాలని ఎలాంటి పోరాటం చేసిందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 13 Jan 2025 4:37 AM GMTరాశీఖన్నా టాలీవుడ్ లో నటిగా రాణించాలని ఎలాంటి పోరాటం చేసిందో చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. స్టార్ హీరోలతో నటించినా? కలిసి రాలేదు. టాలీవుడ్ లో దాదాపు ఎనిమిదేళ్ల పాటు సినిమాలు చేసింది. రెండున్నరేళ్లగా టాలీవుడ్ లో కనిపించలేదు.అవకాశాలు రాకపోవడంతో తమిళ, హిందీ చిత్రాలపై దృష్టి పెట్టి ముందుకెళ్తుంది.
అక్కడా సరైన ఫలితాలు రావడం లేదు. టాలీవుడ్ లో మడి కట్టుకుని కూర్చున్నా? హిందీలో మాత్రం బికినీ, లిప్ లాక్ ప్రయత్నాలు చేసినా పనవ్వలేదు. చేసిన సినిమాలు నిరాశనే మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మడు సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాదిన సినిమా అభిమానులు ఎక్కువని...ఇక్కడ హీరోలను దేవుళ్లుగా కోలుస్తారంది. సినిమా రిలీజ్ రోజును ఓ పండగా రోజులా భావిస్తారంది. సౌత్ ఆడియన్స్ తినడం మానేస్తారేమో కానీ సినిమాలు చూడటం మాత్రం ఆపరని అంది.
అదే నార్త్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందంది. సినిమాలు పక్కనబెట్టి మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సౌత్ లో పనిచేసినంత కాలం ఇలాంటి కామెంట్లు ఎక్కడా కనిపించవు. పరిశ్రమను వదిలి వెళ్లిన తర్వాత మాత్రం అక్కసు వెళ్లగక్కుతుంటారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలాగే వ్యాఖ్యానించింది.
పాన్ ఇండియా సినిమాల్లో తమకు అవకాశాలు ఇవ్వడం లేదని... ప్రతిభావంతులకు అలాంటి ప్రాజెక్ట్ ల్లో అవకాశాలు రావని వ్యాఖ్యానించింది. అప్పట్లో అవి నెట్టింట వైరల్ అవ్వడంతో? రకుల్ పై సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తన వ్యాఖ్యల వెనుక కారణం అది కాదని సర్దుకునే ప్రయత్నం చేసింది.