Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌-న‌య‌న్ ఇలా నిరుత్సాహ‌ప‌రుస్తారేంటి?

`జ‌వాన్`తో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బాలీవుడ్ కి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 April 2024 6:52 AM GMT
ర‌ష్మిక‌-న‌య‌న్ ఇలా నిరుత్సాహ‌ప‌రుస్తారేంటి?
X

`జ‌వాన్`తో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార బాలీవుడ్ కి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిందో తెలిసిందే. ఏకంగా తొలి సినిమాలోనే షారుక్ ఖాన్ తో న‌టించే అరుదైన అవ‌కాశం అందుకుంది. అటుపై `జ‌వాన్` హిట్ తో అమ్మ‌డి పేరు ఇండియా అంత‌టా మారుమ్రోగిపొయింది. ఈ విజ‌యంతో న‌య‌న్ కి బాలీవుడ్ లో గ్రాండ్ లాంచింగ్ ద‌క్కిన‌ట్లు అయింది. దీంతో కొన్నాళ్ల పాటు బాలీవుడ్ కెరీర్ ప‌రంగా వెన‌క్కి తిరిగి చూడ‌కుండా సాగిపోతుంద‌ని అంతా భావించారు.

హిందీలో వ‌రుస అవ‌కాశాల‌తో పుల్ బిజీ అవ్వ‌డం ఖాయ‌మ‌నుకున్నారు. స్టార్ హీరోలే పిలిచి అవ‌కాశా లిస్తున్నార‌న్నారు. కానీ స‌న్నివేశం అందుకు భిన్నంగా క‌నిపిస్తుంది. `జ‌వాన్` రిలీజ్ అయిన ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నా? ఇంత‌వ‌ర‌కూ మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది లేదు. క‌నీసం క‌థ‌లు వింటున్న‌ట్లు కూడా ప్ర‌చారంలోకి రాలేదు. బాలీవుడ్ మీడియా ఆమెని ప‌ట్టించుకున్న‌ట్లు కూడా క‌నిపించ‌లేదు. స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్ఙితుల్లోనే క‌నిపిస్తుంది నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌. `యానిమ‌ల్` విజ‌యంతో అమ్మ‌డి పేరు మ‌రోసారి పాన్ ఇండియాలో మారుమ్రోగిపోయింది.

బోల్డ్ అప్పిరియ‌న్స్ తో మ‌రింత రీచ్ అయింది. దీంతో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ ఈమెనంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ `యానిమల్` త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ మ‌రో హిందీ సినిమాకి సైన్ చేసింది లేదు. `పుష్ప‌-2`..`రెయిన్ బౌ`... `దిగ‌ర్ల్ ప్రెండ్` అనే తెలుగు సినిమాలు చేస్తుంది త‌ప్ప‌! హిందీ ప్రాజెక్ట్ లు క‌నిపించ‌లేదు. ఇటీవ‌లే `చావా` అనే హిందీ సినిమాకి సైన్ చేసినట్లు ప్ర‌చారం సాగింది. కానీ అందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

ఇలా న‌య‌న్..ర‌ష్మిక కెరీర్ లో ఒకటి ఊహించుకుంటే..మ‌రొక‌టి జ‌రుగుతోంది. మ‌రి ఇప్ప‌ట‌కైనా మేల్కోని ఉన్న క్రేజ్ ని నార్త్ మార్కెట్ లో ఎన్ క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నాలేవైనా మొద‌లు పెడ‌తారా? లేక ఇలా కూల్ గా సాగిపోతే చాలు అని రిలాక్స్ అవుతారా? అన్న‌ది చూడాలి. న‌య‌నతార అయితే అంత ఈజీగా ఛాన్స్ తీసుకునే టైపు కాదు. కానీ ర‌ష్మిక మాత్రం ఆ ఛాన్స్ తీసుకునే అవ‌కాశం ఉంది. మ‌రి స‌రైన ప్రాజెక్ట్ రాలేద‌ని వెయిట్ చేస్తుందో! ఏమో.