Begin typing your search above and press return to search.

వార్ బ్యూటీతో బబ్లీ గర్ల్.. డబుల్ గ్లామర్ డోస్

వాణి కపూర్ అయితే, క్లీవేజ్ సొగసులు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. రాశీఖన్నా బ్లాక్ డ్రెస్ లో మెరవగా, వాణి కపూర్ సిల్వర్ కలర్ డ్రెస్ లో కనిపించింది.

By:  Tupaki Desk   |   23 Aug 2023 7:40 AM GMT
వార్ బ్యూటీతో బబ్లీ గర్ల్.. డబుల్ గ్లామర్ డోస్
X

ఒక ఫ్రేమ్ లో ఒక్క హీరోయిన్ ఉంటేనే స్క్రీన్ మొత్తానికి అందం వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఒక్క ఫ్రేమ్ లో ఇద్దరు హీరోయిన్లు, అది కూడా ఒకరిని మించిన అందం మరొకరిది అయితే, ఆ స్క్రీన్ చూడటానికి ఇంకెంత అందంగా ఉంటుందో స్పెషల గా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా, బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణి కపూర్ లు ఇద్దరూ దుబాయిలో కలిశారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


వీరిద్దరినీ ఇలా కలిపి చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. వాణి కపూర్ అయితే, క్లీవేజ్ సొగసులు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం. రాశీఖన్నా బ్లాక్ డ్రెస్ లో మెరవగా, వాణి కపూర్ సిల్వర్ కలర్ డ్రెస్ లో కనిపించింది. కాగా, ఈ ఇద్దరు బ్యూటీలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఈ విషయం అందరికీ తెలిసిందే.


వీరిద్దరూ గతంలో చాలా సార్లు తమ స్నేహం గురించి బహిరంగంగానే చెప్పారు. అప్పడుప్పుడు తాము ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాగా ఇటీవల వాణికపూర్ తన 35వ పుట్టిన రోజు జరుపుకున్నారు. దుబాయిలో ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించగా, రాశీ ఖన్నా కూడా పాల్గొంది. వీరిద్దరూ ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, వైరల్ గా మారింది.వీరి ఫోటోలకు ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.


కాగా, రాశీఖన్నా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తన కెరీర్ మొదలుపెట్టి, వరసగా అవకాశాలు అందుకుంది. ఈ మధ్యే కాస్త జోరు తగ్గింది. అయితే, సినిమాల్లో అవకాశాలు తగ్గినా, వెబ్ సిరీస్ లలో ఛాన్సులు దక్కించుకుంటోంది.


ఇక, వాణికపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులోనూ నాని సరసన ఆహా కళ్యాణం మూవీలో నటించింది. అయితే, ఆ మూవీ క్లిక్ కాకపోవడంతో, మళ్లీ ఆమెకు పెద్దగా ఇక్కడ అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది.