Begin typing your search above and press return to search.

ఆ వీడియో ఇప్పటిది కాదు.. ప్లీజ్ మిస్ లీడ్ చేయొద్దు..!

అటు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క రష్మి సినిమాల్లో కూడా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 9:37 AM GMT
ఆ వీడియో ఇప్పటిది కాదు.. ప్లీజ్ మిస్ లీడ్ చేయొద్దు..!
X

బుల్లితెర మీద జబర్దస్త్ షోకి సూపర్ పాపులారిటీ ఉంది. అందులో చేసిన కమెడియన్స్ కు మంచి ఛాన్సులు రాగా యాంకర్స్ కు కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. అనసూయ ఇప్పుడు సినిమాల్లో అలా రాణిస్తుంది అంటే ఒకప్పుడు ఆమె జబర్దస్త్ యాంకర్ గా ఆకట్టుకోవడం వల్లే అని చెప్పొచ్చు. ఇక అనసూయ బయటకు వచ్చినా రష్మి మాత్రం ఇప్పటికీ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ లో ఎన్ని మార్పులు వచ్చినా యాంకర్ గా రష్మి మాత్రం కొనసాగుతూనే ఉంది.

అటు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క రష్మి సినిమాల్లో కూడా నటిస్తుంది. తన మార్క్ బోల్డ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఐతే లేటెస్ట్ గా రష్మి తన పాత వీడియో ఒకటి వైరల్ అవ్వడంతో దాని గురించి వివరణ ఇచ్చింది. మైనర్ ని అత్యాచారం చేయడం వేరు, కాస్టింగ్ కౌచ్ వేరు. 2020 లో ఇచ్చిన తన ఇంటర్వ్యూని ఆడియన్స్ ని మిస్ లీడ్ చేసేందుకు వాడుతున్నారు దయచేసి గమనించగలరు అంటూ తన ఎక్స్ లో రాసుకొచ్చింది రష్మి.

జానీ మాస్టర్ కేసు గురించి రష్మి స్పందన ఇది అన్నట్టుగా కొందరు పాత వీడియోని వైరల్ చేస్తున్నారు. ఐతే దీనిపై రష్మి వెంటనే స్పందించింది. తన నోటీస్ కు రాగానే అది పాత వీడియో అని ఎప్పుడో నాలుగేళ్ల క్రితం వీడియోని ప్రెజంట్ వీడియోగా ప్రమోట్ చేస్తున్నారని చెప్పొచ్చింది. రష్మి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అలర్ట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా వ్యాప్తి చెందకుండానే ఖండించింది.

జబర్దస్త్ యాంకర్ గా సినిమాల్లో కూడా తనకు వచ్చిన పాత్రలు చేస్తూ సత్తా చాటుతుంది రష్మి. ఐతే ఈమధ్య సినిమాల్లో పెద్దగా కనిపించని అమ్మడు సరైన ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. జబర్దస్త్ కి మాత్రం మధ్యలో ఎంతమంది వచ్చి వెళ్తున్నా వన్ అండ్ ఓన్లీ యాంకర్ గా రష్మి కొనసాగుతుంది. జబర్దస్త్ షోని కూడా వెరైటీగా వాళ్లలో వారికే కాంపిటీషన్ పెట్టి స్కిట్స్ క్వాలిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ గా జబర్దస్త్ షోకి కొత్త జడ్జిగా శివాజి ఎంట్రీ ఇచ్చారు.