కుక్క దాడిలో చిన్నారి మృతి..తల్లి తండ్రిని తప్పు పట్టిన రష్మీ!
పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తాండూరులో చోటు చేసుకుంది
By: Tupaki Desk | 14 May 2024 12:15 PM GMTపెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తాండూరులో చోటు చేసుకుంది. దీంతో ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టి చంపారు. ఓ నెటి జనుడు ఆ కుక్కను చంపిన తల్లిదండ్రులపైకేసు పెట్టాలంటూ స్పందించాడు. తాజాగా ఈ ఘటనపై యాంకర్ కమ్ నటి రష్మి గౌతమ్ స్పందించింది. 'చిన్నారిని ఎందుకంత అజాగ్రత్తగా వదిలేసారు? దాడి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? కనీసం ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి.
తెలివి తక్కువగా ఉండే తల్లిదండ్రుల గురించి 1000 వీడియోలు నేను షేర్ చేయగలను. పిల్లల జీవితాల్ని రిస్క్ లో పెట్టింది ఎవరు? అదే జంతువుల విషయానికి వస్తే ఈ లాజిక్ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి మీరు మాత్రం ప్రశాంతత పొందాలనుకుంటే? అది సాధ్యమయ్యేది కాదు' అని అంది. దీనికి మరో నెటి జనుడు స్పందిస్తూ... 'మీకు బుర్ర లేదని అర్దమైందండి. ఈ మాట అన్నందుకు సారీ' అని అనగా..' మీకు ఉంది కదా. పిల్లల్ని కనడమే కాదు. ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.
బాధ్యత కూడా మీదే. పెంపుడు జంతువులు ఉన్నవారు పిల్లల్నిఅలా వదిలేయకండి'అని అన్నారు. 24 గంటలు పిల్లలతోనే ఎవరూ ఉండలేరు. రేపు మీరు కూడా. ఇలాంటివి కేవలం ఒక నిమిషం గ్యాప్ లోనే జరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి అనుకోకుండా జరుగుతుంటాయి' అని మరొకరు రిప్లై ఇవ్వగా...'మీరన్నది నిజమే. అనుకోకుండా జరుగుతుంటాయి. కానీ ఏదీ ఒక్క నిమిషంలో జరగదు. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా చూడాలి.
బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతువుల్నియజమానే చూడాలి. వాటికి తగిన శిక్షణ ఇవ్వాలి. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలి' అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మి పోస్టుతో ఆమె మూగ జీవాల ప్రేమికురాలిగా తెలుస్తుంది. ప్రస్తుతం రష్మి పలు సినిమాలతో పాటు టీవీ షోలు చేస్తోన్న సంగతి తెలిసిందే.