నైట్ షూట్స్ లో రష్మిక 4AM స్నాక్ ఇదే!
నైట్ షూట్స్ ను ఈజీగా మరల్చుకోవడానికి తాను 4 AM స్నాక్స్ తో టైమ్ పాస్ చేస్తుంది. దానికి సంబంధించిన ఓ ఫోటోను కూడా రష్మిక ఇన్‌స్టాలో షేర్ చేసింది.
By: Tupaki Desk | 23 Feb 2025 7:55 AM GMTవరుస విజయాలతో లైఫ్ ను తెగ ఎంజాయ్ చేస్తుంది నేషనల్ క్రష్ రష్మిక. యానిమల్, పుష్ప2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన రష్మిక రీసెంట్ గా ఛావా మూవీతో మరోసారి బ్లాక్ బస్టర్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఛావా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్న సికిందర్.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికిందర్ ప్రస్తుతం నైట్ షూటింగ్స్ ను జరుపుకుంటుంది. ఈ నైట్ షెడ్యూల్ షూటింగ్స్ లో రష్మిక కూడా పాల్గొంటుంది. మధ్యలో ఛావా ప్రమోషన్స్ కోసం బ్రేక్ తీసుకున్న రష్మిక ఫిబ్రవరి 14 నుంచే మళ్లీ ఈ సినిమా షూటింగ్ లో రీజాయిన్ అయింది.
ప్రతి సినిమాను కష్టంగా కాకుండా ఇష్టపడి చేసే రష్మిక తన నైట్ షూట్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. నైట్ షూట్స్ ను ఈజీగా మరల్చుకోవడానికి తాను 4 AM స్నాక్స్ తో టైమ్ పాస్ చేస్తుంది. దానికి సంబంధించిన ఓ ఫోటోను కూడా రష్మిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన నైట్ షూట్స్ ను మరింత బావుండేలా చేసే 4AM స్నాక్ ఇదేనంటూ రష్మిక న్యూడుల్స్ బౌల్స్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
టైగర్3 తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత సల్మాన్ ఖాన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఆల్రెడీ రిలీజైన సికిందర్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంటెన్స్ గా అనిపించడంతో పాటూ అతని బీజీఎం విజువల్స్ ను మరింత గ్రాండియర్ గా నిలబెట్టింది.
ఇక రష్మిక విషయానికొస్తే రీసెంట్ గా ఛావా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక తెలుగులో పలు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర సినిమాతో పాటూ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గర్ల్ ఫ్రెండ్ మూవీ చేస్తుంది. ఇది కాకుండా రెయిన్ బో సినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.