Begin typing your search above and press return to search.

ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా ఇంట్లో కూతురినే: ర‌ష్మిక‌

బ‌య‌ట త‌న‌కెంతో మంది ఫ్యాన్స్ ఉన్న‌ప్ప‌టికీ ఇంట్లో తాను ఒక కూతురు, సోద‌రి, భాగ‌స్వామి అని అదంతా త‌న వ్య‌క్తిగ‌త జీవిత‌మ‌ని, దాన్ని తానెంతో గౌర‌విస్తాన‌ని ర‌ష్మిక తెలిపింది.

By:  Tupaki Desk   |   28 Jan 2025 9:30 AM GMT
ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా ఇంట్లో కూతురినే: ర‌ష్మిక‌
X

యానిమ‌ల్, పుష్ప‌2 సినిమాల‌తో త‌న స‌త్తాను పాన్ ఇండియా లెవెల్ లో చాటిన నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా బాలీవుడ్ లో విక్కీ కౌశ‌ల్ తో క‌లిసి చేసిన చావా సినిమా రిలీజ్ కు రెడీ అయిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చావా చిత్ర మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేశారు. ఈ ప్ర‌మోష‌న్స్ లో ర‌ష్మిక చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. మొన్న జ‌రిగిన ట్రైల‌ర్ లాంచ్ కు కూడా ర‌ష్మిక కాలు బాలేక‌పోయినా కుంటుతూ ఈవెంట్ కు హాజ‌రైంది. ఈ నేప‌థ్యంలో రష్మిక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

త‌న‌కు ఇంట్లో ఉండ‌ట‌మంటే చాలా ఇష్ట‌మ‌ని, ఇంట్లో ఉన్న‌ప్పుడు ఎంతో సంతోషంగా, పాజిటివ్ గా అనిపిస్తుంద‌ని, ఎక్క‌డా ద‌క్క‌ని ఆనందం ఇంట్లో ఉంటే ద‌క్కుతుంద‌ని, అదే త‌న హ్యాపీ ప్లేస్ అని చెప్తోంది ర‌ష్మిక‌. బ‌య‌ట త‌న‌కెంతో మంది ఫ్యాన్స్ ఉన్న‌ప్ప‌టికీ ఇంట్లో తాను ఒక కూతురు, సోద‌రి, భాగ‌స్వామి అని అదంతా త‌న వ్య‌క్తిగ‌త జీవిత‌మ‌ని, దాన్ని తానెంతో గౌర‌విస్తాన‌ని ర‌ష్మిక తెలిపింది.

కాబోయే వ్య‌క్తిలో ఏ విష‌యాలు మీకు న‌చ్చుతాయ‌ని ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక‌ను అడగ్గా, న‌వ్వుతూ ఉండే వాళ్లంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఎదుటివారిని గౌర‌వించే వ్య‌క్తుల‌ను తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని, ఎదుటివారిలో ముందుగా క‌ళ్లు చూస్తాన‌ని ర‌ష్మిక తెలిపింది. ర‌ష్మిక మాట‌లు విని అంద‌రూ అమ్మ‌డు రిలేష‌న్‌షిప్ లో ఉంద‌ని కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక ప్రేమ‌లో ఉంద‌ని ఎప్ప‌ట్నుంచో వార్త‌లొస్తున్న విష‌యం తెలిసిందే. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు వారిద్ద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న‌ది కేవ‌లం స్నేహం మాత్రమే అని చెప్తున్న‌ప్పటికీ, ఈ ప్రేమ వార్త‌లు మాత్రం ఆగ‌డం లేదు. అయితే ర‌ష్మిక‌, విజ‌య్ ఎంత లేద‌ని చెప్పినా వారిద్ద‌రూ రిలేష‌న్ లో ఉన్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇక చావా సినిమా విష‌యానికొస్తే ర‌ష్మిక కు చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర ద‌క్కింద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో ర‌ష్మిక చేస్తున్న‌ది శంభాజీ భార్య యేసుబాయ్ బోన్సాలే పాత్ర‌. శంభాజీ చ‌నిపోయాక రాయ‌గ‌డ్ సంస్థానాన్ని కాపాడుకోవ‌డానికి యేసుబాయ్ చేసిన యుద్ధం గురించి ఇప్ప‌టికీ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. మ‌రాఠా సామ్రాజ్య‌పు మ‌హారాణిగా యేసుబాయ్ గురించి, ఆ సామ్రాజ్యానికి ఆమె చేసి సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని చెప్పుకుంటారు. ఈ లెక్క‌న ర‌ష్మిక పాత్ర చావాలో చాలా పెద్ద‌దే.