మైనర్ యాక్సిడెంట్.. నిజం దాచేసిన రష్మిక!
అంతేకాదు ప్రమాదం వల్ల ఒక నెల రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించింది.
By: Tupaki Desk | 9 Sep 2024 4:32 PM GMTరష్మిక మందన్న ఇటీవల కొంత కాలంగా సోషల్ మీడియాల్లో అంతగా యాక్టివ్ గా లేకపోవడం అభిమానుల్లో సందేహం రాజేసింది. అయితే చివరికి రష్మిక సైలెన్స్ ని బ్రేక్ చేసింది. తన సైలెన్స్ వెనక అసలు కారణాన్ని రివీల్ చేసింది. ఇన్‌స్టా ద్వారా అభిమానులకు ఒక చిన్న ప్రమాదం నుండి కోలుకుంటున్నానని తెలియజేసింది. అంతేకాదు ప్రమాదం వల్ల ఒక నెల రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించింది.
కొంతకాలంగా జనం దృష్టికి దూరంగా ఎందుకు ఉందో ఇప్పుడు అర్థమైంది. గత నెలలో తనకు చిన్న ప్రమాదం జరిగిందని, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని రష్మిక తన ఇన్ స్టా కథనంలో వెల్లడించింది. అయితే తాను ఇప్పుడు కోలుకున్నానని, యాక్టివ్‌గా ఉన్నానని అభిమానులకు స్పష్ఠతను ఇచ్చింది. తెల్లటి చొక్కా-నల్ల కళ్లద్దాలు ధరించి చక్కందాన్ని దాచేస్తూ సెల్ఫీని రష్మిక షేర్ చేసింది. ఇదిగో అబ్బాయిలు.. ఎలా ఉన్నారు? నేను పబ్లిక్‌గా కనిపించి చాలా కాలం అయిందని నాకు తెలుసు. నేను గత నెలలో యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం.. నాకు చిన్న ప్రమాదం (మైనర్ ఒకటి) అయింది. వైద్యుల సలహా మేరకు చికిత్సతో నేను కోలుకుంటున్నాను. నేను ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను. ముందుకు సాగుతున్నాను.. చాలా యాక్టివ్‌గా ఉండే దశలో ఉన్నాను.. కాబట్టి నా కార్యకలాపాలతో అన్నివిధాలా ఉత్తమంగా వ్యవహరిస్తాను... అని రష్మిక తెలిపింది.
మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి ఎల్లప్పుడూ..! జీవితం చాలా కఠినంగా ఉంది. మనకు రేపు ఉంటుందో లేదో తెలియదు.. కాబట్టి ప్రతిరోజూ ఆనందాన్ని ఎంచుకోండి!! అని సూచించింది. తనకు ఇష్టమైన స్వీట్లు తినడంలో సరదాగా ఉంటుదని కూడా అంది. నేను చాలా లడ్డూలు తింటున్నాను! అంటూ ఊరించింది.
విక్కీ కౌశల్‌కు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం `ఛావా`లో రష్మిక కనిపించనుంది. తదుపరి ధనుష్- నాగార్జున అక్కినేనితో కలిసి `కుబేర`లోను కనిపించనుంది. ది గర్ల్‌ఫ్రెండ్ లో ధీక్షిత్ శెట్టితో స్క్రీన్‌ను పంచుకుంటుంది. డిసెంబరు 6న థియేటర్లలో విడుదల కానున్న `పుష్ప: ది రూల్` సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప-శ్రీవల్లి రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆశ.