రష్మిక పోస్ట్..మహారాణిలా చూసుకుంటానంటూ రిప్లై!
తాజాగా రష్మిక పోస్ట్ కు బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ మహారాణిలా చూసుకుంటానంటూ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ ఏంటా కహానీ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
By: Tupaki Desk | 3 Nov 2024 6:27 AM GMTనేషనల్ క్రష్ రష్మికా మందన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. యువత కలల నాయికగా మారిపోయింది. పాన్ ఇండియాలోనే నేషనల్ క్రష్ ఇప్పుడో సంచలనం. ఆమె నుంచి సోషల్ మీడియాకి ఎలాంటి ఫోటోలొచ్చినా.. పోస్టులొచ్చినా అవి నెట్టింట సంచలనమే. తాజాగా రష్మిక పోస్ట్ కు బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ మహారాణిలా చూసుకుంటానంటూ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ ఏంటా కహానీ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
శ్రీకాంత్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మను వివాహం ఆడుతున్నాడు. ఇటీవలే శ్యావ్య స్నేహితులందరికీ బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చింది. ఇందులో రష్మిక మందన్న, వర్ష బొల్లమ్మ కూడా పాల్గొన్నారు. అంతా పార్టీని పుల్ గా ఎంజాయ్ చేసారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోని శ్రావ్య ఇన్ స్టా వేదికగా పంచుకుంది. నా గర్ల్ గ్యాంగ్ తో సింగిల్ గా ఇదే నా లాస్ట్ వీకెండ్` అని రాసుకొచ్చింది. దీనికి రష్మిక రిప్లై ఇలా ఇచ్చింది.
శ్రావ్య వర్మ మేడం పెళ్లి చేసుకుంటున్నారు. శ్రీకాంత్ కిదాంబి ఇకపై తన బాధ్యత నీదే. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి..ఒకే` అంటూ రాసుకొచ్చింది. దీనికి శ్రీకాంత్ ఇలా స్పందించాడు. `మహారాణిలా` చూసుకుంటా నన్నాడు. శ్రావ్య వర్మ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మేనకోడలు. నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, విక్రమ్, ధృవ్ వంటి హీరోల చిత్రాలకు స్టైలిస్ట్ గా పనిచేసారు.
అయితే మేనమామ వర్మ తెరకెక్కించిన సినిమాలకు మాత్రం ఆమె పనిచేసిందా? లేదా? అన్నది తెలియాల్సిన అంశం. విజయ్ తో ఆమెకు మంచి స్నేహం ఉంది. తనకు విజయ్ విజయ్ బ్రదర్ లాంటి వాడు అని శ్రావ్య ఎన్నో సందర్భాల్లో బయట పెట్టింది.