Begin typing your search above and press return to search.

ఆ క్రెడిట్ అంతా వారిదే - రష్మిక మందన్న

ముఖ్యంగా ఈ సాంగ్ లో రష్మిక మందన్న అల్లు అర్జున్ తో పోటీ పడి డాన్స్ చేసిందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 5:01 AM GMT
ఆ క్రెడిట్ అంతా వారిదే - రష్మిక మందన్న
X

‘పుష్ప 2’ మూవీ నుంచి తాజాగా పీలింగ్స్ అనే మాస్ డ్యూయెట్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక డాన్స్ మూమెంట్స్ అందరిని ఎట్రాక్ట్ చేస్తూ ఉండటం విశేషం. ప్రత్యేకంగా వారిద్దరూ కలిసి వేసిన కొన్ని హుక్ స్టెప్స్ అయితే రిపీటెడ్ గా సాంగ్ ని చూసేలా చేస్తున్నాయి. ఈ సాంగ్ తో సినిమాకి మరింతగా హైప్ వచ్చింది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేశాయి. దీంతో కంటెంట్ పైన ఆడియన్స్ కి నమ్మకం పెరిగింది. కచ్చితంగా సుకుమార్ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని థియేటర్స్ లో ఇవ్వబోతున్నాడనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన పీలింగ్స్ సాంగ్స్ కి ప్రేక్షకులు, సినీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సాంగ్ లో రష్మిక మందన్న అల్లు అర్జున్ తో పోటీ పడి డాన్స్ చేసిందనే మాట వినిపిస్తోంది. సినీ విశ్లేషకులు ఇదే విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తున్నారు. రష్మిక డాన్స్ గ్రెస్ బన్నీ స్పీడ్ ని మ్యాచ్ చేసిందని అంటున్నారు. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి కొత్త హుక్ స్టెప్స్ క్రియేట్ చేసాడని, కచ్చితంగా చాలా రోజుల పాటు ఈ సాంగ్ సౌండ్ చేస్తుందని పోస్టులు పెడుతున్నారు.

ఇక సాంగ్ కి వస్తోన్న రెస్పాన్స్ పైన రష్మిక మందన రియాక్ట్ అయ్యింది. పీలింగ్స్ సాంగ్ క్రెడిట్ అంతా అల్లు అర్జున్, సుకుమార్ సర్ కి ఇవ్వాలని ట్వీట్ చేసింది. వారిద్దరి వలన నేను ఈ స్థాయిలో డాన్స్ చేయగలిగానని చెప్పింది. నిజానికి నా పెర్ఫార్మెన్స్ కి ఇంత మంచి ఆదరణ వస్తుందని నేను నమ్మలేదు. అయితే ఇదంతా అల్లు అర్జున్, సుకుమార్ సార్ తోనే సాధ్యం అయ్యిందని పోస్ట్ పెట్టింది.

నెటిజన్లు రష్మిక పోస్ట్ పైన భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. పీలింగ్స్ సాంగ్ లో అవుట్ స్టాండింగ్ డాన్స్ తో అదరగొట్టేసారు అంటూ ప్రశంసిస్తున్నారు. అల్లు అర్జున్, మీరు చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ నుంచి అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో ఒక సాంగ్ వస్తే బాగుంటుందని ఎక్స్ పెక్ట్ చేశారు. పీలింగ్స్ సాంగ్ తో అభిమానుల కోరిక తీరిపోయిందని చెప్పొచ్చు.