Begin typing your search above and press return to search.

వామిక ఫోటోతో రష్మిక క్షమాపణలు!

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఆమె బ్రాండింగ్‌ చేస్తున్న కంపెనీల్లో ఒనిట్సుకా టైగర్ బ్రాండ్‌ ఒకటి.

By:  Tupaki Desk   |   28 Feb 2025 9:35 AM GMT
వామిక ఫోటోతో రష్మిక క్షమాపణలు!
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఆమె బ్రాండింగ్‌ చేస్తున్న కంపెనీల్లో ఒనిట్సుకా టైగర్ బ్రాండ్‌ ఒకటి. చాలా కాలంగా రష్మిక ఈ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ప్రతి సంవత్సరం రష్మికతో ఫోటో షూట్‌ చేసి సదరు సంస్థ తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి వామిక గబ్బి ఫోటోలతో ఒనిట్సుకా టైగర్ సంస్థ తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేసింది. పలువురు రష్మిక ఈ సంస్థ నుంచి తప్పుకుందా అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే, కొందరు రష్మిక పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేయడం వల్ల ఆమెను తప్పించారని అంటున్నారు.


అసలు విషయం ఏంటంటే రష్మిక గత కొన్ని వారాలుగా కాలి గాయం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. అందుకే ఆమె ఒనిట్సుకా టైగర్ సంస్థకు ఈ సారి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించలేనని, అంతే కాకుండా ఫోటో షూట్స్‌కి హాజరు కాలేను అని చెప్పుకొచ్చిందట. దాంతో ఆమె స్థానంలో వామిక గబ్బిని ఎంపిక చేయడం జరిగింది. తాజాగా ఒనిట్సుకా టైగర్ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌ వామిక ఫోటోలను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఈసారి సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనందుకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ వామికా ఫోటోకు, ఆమె ధరించిన ఔట్‌ ఫిట్‌పై ప్రశంసలు కురిపించింది.

రష్మిక మందన్న కాలి గాయం కారణంగా చాలా కార్యక్రమాలకు హాజరు కాలేక పోతుంది. ఇటీవల జరిగిన ఒక ఫారిన్‌ ఈవెంట్‌లోనూ రష్మిక హాజరు కాలేదు. మరో నెల రోజుల పాటు ఆమె పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం అందుతోంది. కాలి గాయం, నొప్పితోనే ఛావా సినిమా ప్రమోషన్‌లో రష్మిక మందన్న పాల్గొన్నది. ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యానిమల్‌, పుష్ప 2 సినిమాల తర్వాత ఇప్పుడు ఛావా సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. కనుక రష్మిక నేషనల్‌ క్రష్‌ మాత్రమే కాకుండా నేషనల్‌ స్టార్‌ హీరోయిన్‌ అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.

మరో వైపు ఈ అమ్మడి సినిమాల జాబితా చూస్తే పెద్దగానే ఉంది. ముందుగా రష్మిక మరో బాలీవుడ్‌ మూవీ సికిందర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సికందర్ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్‌లో రష్మిక మందన్న లుక్‌కి మంచి స్పందన వచ్చింది. కనుక మరోసారి రష్మిక సికిందర్‌తో తన సక్సెస్‌ జర్నీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తుంది. ఇక ధనుష్‌ తో కలిసి నటించిన కుబేరా సినిమా జూన్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండతో కలిసి కింగ్డమ్‌ లోనూ కీలక పాత్రలో రష్మిక మందన్న నటించింది అనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రష్మిక చాలా చాలా బిజీగా ఉంది.