Begin typing your search above and press return to search.

రష్మిక పీలింగ్స్.. ఇది హీటెక్కించే ట్రీట్!

ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. సినిమా నుంచి రిలీజ్ చేస్తున్న సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Dec 2024 7:11 AM GMT
రష్మిక పీలింగ్స్.. ఇది హీటెక్కించే ట్రీట్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన నెవ్వర్ బిఫోర్ అనేలా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అవ్వగా.. మూవీ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. సినిమా నుంచి రిలీజ్ చేస్తున్న సాంగ్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప టైటిల్ సాంగ్, సూసేకి అగ్గి రవ్వ మాదిరి సాంగ్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. యంగ్ హీరోయిన్ శ్రీలీల చిందులేసిన కిస్సిక్ ఇప్పటికే మిలియన్స్ లో వ్యూస్ దక్కించుకుంటోంది. ఇప్పుడు పీలింగ్స్ సాంగ్ కూడా దూసుకుపోతోంది.

ఫుల్ మాస్ బీట్ తో రూపొందిన ఆ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే రీతిలో బాణీల కుట్టారు. లక్ష్మీదాస, శంకర్‌ బాబు కందుకూరి తమ గాత్రంతో ప్రాణం పోశారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన మార్క్ స్టెప్పులతో పీలింగ్స్ సాంగ్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇక బన్నీ, రష్మిక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పోటీపడుతూ మరీ ఇద్దరూ స్టెప్పులేసి అదరగొట్టారు. అల్లు అర్జున్ లుంగీతో మాస్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నారు. ఇక రష్మిక గ్లామరస్ చీరలో తన మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. తన అందచందాలతో అదరగొట్టారు. ఒక్కో స్టెప్ లో తన గ్రాస్ తో మైమరిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు రష్మిక కోసమే మాట్లాడుకుంటున్నారు.

పీలింగ్స్ లిరికల్ సాంగ్ లోని రష్మిక డ్యాన్స్ మూవ్మెంట్స్ ను స్క్రీన్ షాట్ తీసి మరీ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. వీడియో క్లిప్స్ ను పోస్ట్ చేస్తున్నారు. నేషనల్ క్రష్ సాంగ్ లో అదరగొట్టేశారని చెబుతున్నారు. చూస్తున్న కొద్దీ ఆమె డ్యాన్స్ చూడాలని అనిపిస్తుందని అంటున్నారు. ఆమె కెరీర్ లోని బెస్ట్ సాంగ్స్ లో ఇదొకటి అని అంతా కామెంట్లు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆమె గ్లామరస్ లుక్స్ హీటెక్కించేలా ఉన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. పక్కా ఈ సాంగ్ గ్లామర్ ప్లస్ మాస్ కలయికలో ఫ్యాన్స్ కి కిక్కివ్వడం గ్యారెంటీ అని అంటున్నారు.

అలా నెట్టింట ఎక్కడ చూసినా రష్మిక పీలింగ్స్ గ్లింప్సే కనిపిస్తున్నాయి. తెగ ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప-1లో కూడా తన డ్యాన్స్ తో ఆమె అదరగొట్టారు. అప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక చాలా రోజుల పాటు ఆమె మూవ్మెంట్స్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు పుష్ప-2 సినిమా రిలీజ్ అయ్యాక.. రష్మిక డ్యాన్స్ కు థియేటర్లలో ఓ రేంజ్ లో ఈలలు వినపడడం పక్కా.