పుష్ప.. ఈ సెంటిమెంట్ కూడా తోడైతే..
అదే సమయంలో రష్మిక డిసెంబర్ సక్సెస్ సెంటిమెంట్ కూడా పుష్ప సీక్వెల్ కు తోడవ్వతుందని కామెంట్లు పెడుతున్నారు.
By: Tupaki Desk | 1 Dec 2024 10:54 AM GMTరష్మిక మందన్న.. తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులరైన హీరోయిన్స్ లిస్ట్ లో ఈ ముద్దుగుమ్మ పేరు కచ్చితంగా ఉండి తీరుతుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఆమె.. పుష్ప మూవీతో ఏకంగా నేషనల్ క్రష్ ట్యాగ్ ను దక్కించుకున్నారు. వేరే లెవల్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్స్ బేస్ దక్కించుకున్నారు.
కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక.. డెబ్యూ మూవీ కిర్రిక్ పార్టీతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత మరో రెండు కన్నడ చిత్రాల్లో నటించి.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఛలో సినిమాతో టాలీవుడ్ మూవీ లవర్స్ ను మెప్పించి సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండతో గీతా గోవిందం చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నారు.
ఆ తర్వాత నుంచి వరుస అవకాశాలు అందుకుని దూసుకుపోతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పుష్ప-2తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీవల్లి 2.0గా మరో మెప్పించేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈసారి నేషనల్ అవార్డు కచ్చితంగా అందుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే పుష్ప-2 డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను తిరగరాస్తుందని పక్కాగా చెబుతున్నారు. అదే సమయంలో రష్మిక డిసెంబర్ సక్సెస్ సెంటిమెంట్ కూడా పుష్ప సీక్వెల్ కు తోడవ్వతుందని కామెంట్లు పెడుతున్నారు.
రష్మికకు డిసెంబర్ తో మంచి అనుబంధం ఉంది. ఆమె డెబ్యూ మూవీ కిర్రిక్ పార్టీ డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. కన్నడలో ఆమె నెక్స్ట్ నటించిన అంజనీపుత్ర, చమక్ మూవీస్ కూడా అదే నెలలో రిలీజ్ అయ్యాయి. మంచి విజయాన్ని అందించాయి. డిసెంబర్ లో వచ్చిన పుష్ప-1తో రష్మిక ఎలాంటి హిట్, ఫేమ్ దక్కించుకున్నారో తెలిసిందే.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంతో రష్మిక వేరే లెవెల్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2తో డిసెంబర్ 5వ తేదీన సందడి చేయనున్నారు. దీంతో తనకు లక్కీ మంత్ అయిన డిసెంబర్ లో పుష్ప2తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.