విజయ్ తో రష్మిక దీపావళి.. పిక్స్ తీసిన తమ్ముడు
ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో విజయ్, రష్మిక డేటింగ్ రూమర్స్ పై చర్చ నడుస్తోంది.
By: Tupaki Desk | 1 Nov 2024 9:40 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ప్రేమాయణం నడుస్తుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ముంబైలో ఇద్దరూ వెంటవెంటనే కనిపించారు. ఆ తర్వాత మాల్దీవ్స్ లో ఉన్నట్లు పిక్స్ ను వేర్వేరుగా పోస్ట్ చేశారు. దీంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ తమ మధ్య ఏం లేదని పలుమార్లు రష్మిక, విజయ్ క్లారిటీ ఇచ్చినా.. రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో విజయ్, రష్మిక డేటింగ్ రూమర్స్ పై చర్చ నడుస్తోంది. అందుకు కారణం దీపావళి సెలబ్రేషన్స్. విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక దివాలీ సెలబ్రేట్ చేసుకున్నారు! ఆ విషయాన్ని ఆమెనే తెలిపారు. కర్ణాటకకు చెందిన రష్మిక.. కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నారు. అనేక ఫెస్టివల్స్ ను ఇక్కడే జరుపుకుంటున్నారు. ఇప్పుడు దీపావళి స్పెషల్ గా ఫోటోస్ షేర్ చేస్తూ.. నెటిజన్లకు, అభిమానులకు ఫెస్టివల్ విషెస్ తెలిపారు.
అయితే అక్కడికి కాసేపటి తర్వాత తన పోస్ట్ కి తానే కామెంట్ పెట్టుకున్నారు రష్మిక మందన్న. ఫోటో క్రెడిట్స్ యంగ్ ఆనంద్ దేవరకొండకు ఇచ్చారు. థ్యాంక్యూ ఆనంద అని తెలిపారు. అదే సమయంలో విజయ్, ఆనంద్ కూడా తమ ఇంట్లో పండుగను జరుపుకున్నారు. కాబట్టి రష్మిక కూడా వాళ్లతోనే జరుపుకున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో నెటిజన్లు.. రష్మిక, విజయ్ ప్రేమలో ఉండటం నిజమేనని చెబుతున్నారు. ఇంట్లో కూడా చెప్పేసినట్టు ఉన్నారని అంటున్నారు.
దాంతోపాటు గతంలో ఆనంద్ దేవరకొండ మూవీ ఈవెంట్ లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమానికి గెస్ట్ కు వచ్చిన రష్మికకు ఆనంద్.. ఏదో టిపికల్ క్వశ్చన్ అడిగారు. దీంతో ఆమె.. నన్నే స్పాట్ లో పెడతావా.. నేను ఫ్యామిలీ అని అన్నారు. అప్పుడే అంతా ఆనంద్, రష్మిక మధ్య బాండింగ్ చూసి దేవరకొండ ఇంటికి కోడలుగా రష్మిక వెళ్లడం ఖరారైందని అనుకున్నారు. ఇప్పుడు ఆనందే పిక్స్ తీశారని రష్మిక చెప్పడంతో అంతా ఫిక్స్ అయిపోతున్నారు. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.