Begin typing your search above and press return to search.

రష్మిక ఇద్దరు ని డామినేట్ చేసిందా?

ఇక ఈ సినిమాలో బన్నీ తన యాక్టింగ్ తో మాస్ జాతర చూపించాడని, మరో నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 12:30 AM GMT
రష్మిక ఇద్దరు ని డామినేట్ చేసిందా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''పుష్ప 2: ది రూల్''. ఊహించిన విధంగానే ఈ క్రేజీ సీక్వెల్ బాక్సాఫీసును రూల్ చేస్తోంది. విడుదలకు ముందే రికార్డ్ బ్రేకింగ్ నంబర్స్ సాధించిన ఈ చిత్రం.. విడుదలైన తర్వాత మరెన్నో రికార్డులను బ్రేక్ చేయడం ప్రారంభించింది. ఇక ఈ సినిమాలో బన్నీ తన యాక్టింగ్ తో మాస్ జాతర చూపించాడని, మరో నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రష్మిక నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

'పుష్ప 1' లో శ్రీవల్లి వంటి రూరల్ గర్ల్ పాత్రలో డీగ్లామర్ లుక్ లో నటించి అందర్నీ ఆశ్చర్య పరించింది రష్మిక మందన్న. ఇప్పుడు 'పుష్ప 2' మూవీలో పుష్పరాజ్ భార్యగా ఆకట్టుకుంది. ఇందులో ఆమె క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంది. జాతర ఎపిసోడ్‌లో సిన్సియర్ పెర్ఫార్మెన్స్‌తో ఆకర్షించింది. ఈసారి కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. స్క్రీన్ మీద అల్లు అర్జున్ తో మంచి కెమిస్ట్రీ పంచుకుంది రష్మీక. 'పీలింగ్స్‌', 'సూసేకి' పాటల్లో బన్నీతో కలిసి ఆమె చేసిన డ్యాన్సులు ఆడియన్స్ ను మెప్పిస్తున్నాయి.

గతేడాది డిసెంబరులో 'యానిమల్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది రష్మిక. ఇప్పుడు 'పుష్ప 2' చిత్రంతో మరో ఘన విజయం సాధించి తన డిసెంబర్ సెంటిమెంటును నిలబెట్టుకుంది. రెండు సినిమాలలో గీతాంజలి, శ్రీవల్లి పాత్రల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. ఒకప్పుడు ట్రోల్ చేసినవారే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందిస్తున్నారు. పాన్-ఇండియన్ స్టార్‌ డమ్ అందుకుందని అంటున్నారు. రష్మిక సైతం ఈ విజయాలతో చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్ లో అందరికీ రిప్లై ఇస్తూ తన సంతోషాన్ని తెలియజేస్తోంది.

రణబీర్ కపూర్, అల్లు అర్జున్ వంటి ఇద్దరు ఆల్ఫా మేల్స్ ని రష్మిక డామినేట్ చేసిందని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. వీరిద్దరితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, క్రేజీగా ఉందని తెలిపింది. తాను ఇద్దరి నుంచి చాలా నేర్చుకున్నానని, వాళ్లు నిజంగా తన స్థాయిని పెంచారని చెప్పింది. ఈ ఇద్దరు మైండ్ బ్లోయింగ్ యాక్టర్స్ వల్లే నేను ఈరోజు ఇలాంటి యాక్టర్ గా మారానంటూ సమాధానమిచ్చింది.

'పుష్ప 1' సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోగా.. 'పుష్ప 2' లో తన నటనకు నేషనల్ అవార్డ్ వస్తుందని రష్మిక మందన్న ఇఫీ వేదికగా ఆశాభావం వ్యక్తం చేసింది. తాజాగా ఓ నెటిజన్ ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. ప్రేక్షకుల నుండి వచ్చిన ఈ ప్రేమే తనకు అతిపెద్ద అవార్డు అని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సికందర్‌' అనే హిందీ సినిమాలో నటిస్తోంది. మురగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. 'ఛావా' అనే మరో హిందీ మూవీ చేస్తోంది. వీటితో పాటుగా 'కుబేర', 'రెయిన్‌ బో', 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' వంటి మరో మూడు చిత్రాల్లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.