రష్మిక కష్టానికి ప్రతిఫలం వస్తుందా ?
రష్మిక సెంటిమెంట్ కారణంగా సల్మాన్‌కి హిట్ పడే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
By: Tupaki Desk | 27 March 2025 7:20 AMసౌత్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న రష్మిక మందన్న రంజాన్ సందర్భంగా 'సికిందర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్ సినిమాకు తమిళ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. సినిమాకు ఇప్పటి వరకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ రష్మిక నటించింది అనే ఒకే ఒక్క కారణం వల్ల చాలా మంది సినిమాపై పాజిటివ్‌గా ఉన్నారు. సల్మాన్ ఖాన్ గతంలో ఎప్పుడు లేని విధంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. రష్మిక సెంటిమెంట్ కారణంగా సల్మాన్‌కి హిట్ పడే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మూడు సినిమాలతో దాదాపు రూ.3300 కోట్ల వసూళ్లను తన ఖాతాలో కేవలం ఏడాదిన్నర లోపే సొంతం చేసుకుంది. మూడు సినిమాల్లోనూ పవర్ ఫుల్ భార్య పాత్రలో కనిపించింది. ముఖ్యంగా ఛావా సినిమాలో నటనతో మెప్పించింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఛావా సినిమా జోరు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటి సమయంలో రాబోతున్న సికిందర్ సినిమాతో రష్మిక తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఛావా సినిమా ప్రమోషన్‌లో రష్మిక కుంటుకుంటూ వచ్చిన విషయం తెల్సిందే. కాలికి అయిన గాయంను లక్ష్య పెట్టకుండా ఛావా ప్రమోషన్స్‌లో పాల్గొంది.
ఈ ఏడాది ఆరంభంలో రష్మిక జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో కాలికి గాయం అయింది. దాంతో కొన్ని రోజుల పాటు రష్మిక కనీసం నడవలేక పోయింది. ఛావా సినిమా ప్రమోషన్స్‌కి తన అవసరం ఉండటంతో రష్మిక స్టాండ్ పట్టుకుని స్టేజ్ మీద కనిపించింది. ఛావా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత కూడా రష్మిక స్టాండ్‌తోనే కనిపించింది. ప్రమోషన్స్‌లో పూర్తిగా స్టాండ్‌తోనే లేదంటే ఎవరైనా హెల్ప్‌తో పాల్గొంది. సల్మాన్ ఖాన్‌తో సికిందర్ ప్రమోషన్స్‌లోనూ రష్మిక కాలి గాయంతోనే ఇబ్బంది పడుతూ ప్రమోషన్‌లో పాల్గొంది. రష్మిక పూర్తి స్థాయిలో సొంతంగా నడవలేక పోతుంది. ఇంకా కుంటుకుంటూనే నడుస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఒక చిట్‌చాట్‌లో రష్మిక తన కాలి గాయం గురించి స్పందించింది. కాలు గాయం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. పూర్తిగా తగ్గడానికి 9 నెలల సమయం పడుతుందని అన్నారు. అయితే అప్పటి వరకు వెయిట్ చేయాలని అనుకోలేదు. మెల్ల మెల్లగా వర్క్‌లో బిజీ అవుతున్నాను. జాగ్రత్తగా కాలుపై ఎక్కువగా ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు రష్మిక చెప్పుకొచ్చింది. సికిందర్ సినిమా విడుదల తర్వాత రష్మిక కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కుబేర సినిమా షూటింగ్ పూర్తి కాగా గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సైతం చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే రష్మిక కొత్త సినిమాల ప్రకటన ఉండే అవకాశం ఉంది.