రష్మికనే ఏడిపించేసిన చిత్రమది!
ఇంకా కన్నడ చిత్రాల్లోనూ వివిధ పాత్రలు పోషించింది. కానీ ఏనాడు ఏ పాత్ర రష్మికని ఇంతగా ఎమోషన్ కి గురి చేయలేదు.
By: Tupaki Desk | 1 Feb 2025 1:30 PM GMTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఇప్పటివరకూ ఎన్నో చిత్రాల్లో నటించింది. ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించింది. ప్రేమికురాలిగా, స్పోర్స్ట్ ఉమెన్ గా, భార్యగా, ఇలా నచ్చిన పాత్రలన్నింటిలోనూ తనదైన మార్క్ వేసింది. ముఖ్యంగా 'పుష్ప' సినిమాలో శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయింది. ఇంకా కన్నడ చిత్రాల్లోనూ వివిధ పాత్రలు పోషించింది. కానీ ఏనాడు ఏ పాత్ర రష్మికని ఇంతగా ఎమోషన్ కి గురి చేయలేదు.
తొలిసారి ఏసుబాయి పాత్రకు ...'ఛావా' కథకు తానెంతగా కనెక్ట్ అయిందన్నది ఆమె మాటల్ని బట్టి అర్దమవుతుంది. ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా 'ఛావా' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక మందన్నా నటించింది. ఇప్పటికే ఆ పాత్ర ఆహార్యం, లుక్ ప్రతీది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా ప్రచారానికి రష్మిక ఎంత ప్రాధాన్యత ఇస్తుంది..వ్యక్తిగతంగా ఎంతగా కనెక్ట్ అయిందనడానికి ఇదే ఉదాహరణ.
కాలికి గాయమైనా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ముంబైలో జరిగిన 'ఛావా' ఈవెంట్ కి హాజరైంది. సినిమా పూర్తయిన తర్వాత చూసిన ప్రతీసారి కూడా ఎంతో ఎమోషన్ కి గురైందిట. ప్రతీసారి ఏడ్చినట్లు తెలిపింది. ఎందుకిలా జరుగు తుందో తనకే అర్దం కాలేదని అంది. అంతకు ముందు మరో ఈవెంట్ లో ఈ సినిమా తర్వాత సంతోషంగా రిటైర్మెంట్ ప్రకటించొచ్చు అని కూడా వ్యాఖ్యానించింది. ఇంత వరకూ అమ్మడు ఏ సినిమా విషయంలోనూ ఇంతగా ఎమోషన్ కి గురి కాలేదు.
ఏసుబాయి పాత్రకు రష్మిక అంతగా కనెక్ట్ అయింది. ఏసుబాయి పాత్ర నుంచి రష్మిక బయటకు రావడం కూడా కష్టమే అన్నంతగా రియాక్ట్ అవుతుంది. రిలీజ్ అయి హిట్ అయితే రష్మిక ఆనందానికి అవదులే ఉండవు. బాలీవుడ్ లో ఈ సినిమా రష్మిక ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని భావిస్తోంది.