Begin typing your search above and press return to search.

రష్మికపై కొత్త విమర్శలు

పాన్‌ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా దూసుకు పోతున్న రష్మిక ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   2 April 2025 5:30 PM
రష్మికపై కొత్త విమర్శలు
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ యానిమల్‌, పుష్ప 2, ఛావా సినిమాలతో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మూడు సినిమాలతో దాదాపుగా రూ.3300 కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. ఒక హీరోయిన్‌ ఈ స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకున్న సినిమాలను కేవలం రెండేళ్ల గ్యాప్‌లో చేయడం అనేది రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూడు సినిమాల తర్వాత వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ 'సికిందర్‌' సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ నిరాశ పరచినా లాంగ్‌ రన్‌లో రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది. రష్మిక గత చిత్రాలతో పోల్చితే సికిందర్‌ నిరాశ మిగిల్చినట్లే.

పాన్‌ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా దూసుకు పోతున్న రష్మిక ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉంటుంది. ఆమె చేసే వ్యాఖ్యల కారణంగా వివాదంలో ఉంటే, కొన్నిసార్లు ఆమెకు తెలియకుండానే వివాదంలో చిక్కుకుంటుంది. ఇటీవల ఆమె సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆమె ఎంపిక సరిగా లేదు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆమె అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్న యానిమల్‌, పుష్ప 2, ఛావా సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు సినీ విశ్లేషకులు రష్మిక ఆయా సినిమాల్లో చేసిన పాత్రల గురించి కాస్త ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. ఆ మూడు సినిమాల్లోనూ హీరోల పాత్రలను హైలైట్‌ చేయడం కోసం రష్మిక పాత్రను వినియోగించారు.

హీరోయిజం ను చూపించడం కోసం హీరోయిన్‌ పాత్రను వినియోగించారు తప్ప ఆయా సినిమాల్లో హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు రష్మిక సినిమాల ఎంపిక విషయంలో ముఖ్యంగా పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని, స్టార్‌డం చూస్తూ, పారితోషికం విషయంలో మాత్రమే శ్రద్ద పెడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా సినిమాలను ఎంపిక చేసుకునే సమయంలో అసలు పాత్రలు ఏంటి, కథలో ఆ పాత్రల ప్రాముఖ్యత ఏంటి అనేది చూస్తుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా రష్మిక ఆ విషయంలో జాగ్రత్త పడాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భాష ఏదైనా కమర్షియల్‌ సినిమాల్లో ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కేవలం గ్లామర్‌ డాల్‌గా మాత్రమే ఉంటాయి. బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్ కేవలం గ్లామర్‌ డాల్‌గా నటించి, పాటలకు పరిమితం అయిన వారు ఉన్నారు. కానీ రష్మిక ఆ మూడు సినిమాల్లోనూ నటనతో మెప్పించింది. నటించేందుకు స్కోప్ కూడా దక్కింది. అయినా కొందరు కావాలని ఇలాంటి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్‌ సినిమాల్లో హీరోలకు జోడీగా నటించిన సమయంలో అలాంటి కొన్ని సీన్స్‌ ఉంటాయని కొందరు అంటున్నారు. ముందు ముందు రష్మిక మందన్న నుంచి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు సైతం రాబోతున్నాయి. హీరోయిన్‌గా అన్ని సినిమాలు చేయాలి, కనుక రష్మిక మందన్న అన్ని తరహాల సినిమాలు చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయమై రష్మిక మందన్న ఎలా రియాక్ట్‌ అవుతుంది అనేది చూడాలి.