కొద్దిగా గ్యాప్ ఇవ్వు రష్మికా..!
మొన్నటిదాకా సౌత్ లో అదరగొట్టిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో వరుస హిట్లు కొడుతుంది.
By: Tupaki Desk | 8 Dec 2024 4:12 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫాం చూసి మిగతా హీరోయిన్స్ వణికిపోతున్నారు. వరుస సినిమాలు అవి సూపర్ హిట్లు అవుతుండటంతో అమ్మడి రేంజ్ మరింత పెరిగింది. మొన్నటిదాకా సౌత్ లో అదరగొట్టిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో వరుస హిట్లు కొడుతుంది. యానిమల్ హిట్ తో నేషనల్ లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు పుష్ప 2 హిట్ తో మరింత ప్రభావం చూపిస్తుంది. రష్మిక దూకుడు చూస్తుంటే ఈ ఫాం మరికొన్నాళ్లు కొనసాగించేలా ఉంది.
రష్మిక పుష్ప 2 హిట్ జోష్ లో ఉంది. ఐతే ఒక హిట్టు కొట్టాం కదా రిలాక్స్ అవ్వొచ్చు అన్నట్టు కాకుండా వెంటనే తన నెక్స్ట్ సినిమా అప్డేట్స్ తో వస్తుంది. పుష్ప 2 థియేటర్స్ లో రచ్చ చేస్తుండగా ఈ నెల 9న రష్మిక నటిస్తున్న నెక్స్ట్ సినిమా టీజర్ రాబోతుంది. రష్మిక లీడ్ రోల్ లో చిలసౌ ఫేం రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను ఎస్.కె.ఎన్ ఎస్.కె.ఎన్, మాస్ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారు.
పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రలో అదరగొట్టిన రష్మిక ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో సినిమాతో వస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ డిసెంబర్ 9న రాబోతుంది. ఈ టీజర్ గురించి ఈమధ్య పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఈవెంట్ లో మాట్లాడాడు. రష్మిక క్లోజప్స్ చాలా బాగా క్యాప్చర్ చేశావని రాహుల్ తో అన్నానని చెప్పారు. సో రష్మిక క్రేజ్ తో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.
నేషనల్ వైడ్ గా రష్మిక రేంజ్ ఏంటన్నది ఆమె చేస్తున్న సినిమాలను బట్టి చెప్పొచ్చు. పుష్ప్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల మీద ఎక్స్ ట్రా బజ్ ఏర్పడింది. ది గర్ల్ ఫ్రెండ్ తో పాటు రష్మిక మందన్న ధనుష్ కుబేర సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో సికిందర్ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. రష్మిక దూకుడు చూస్తుంటే మరో ఐదారేళ్లు ఇదే ఫాం కొనసాగించేలా ఉంది. ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది కాబట్టి రష్మిక ని ఇప్పుడప్పుడే ఆపలేమని చెప్పొచ్చు. గర్ల్ ఫ్రెండ్ టీజర్ గురించి సుకుమార్ లాంటి డైరెక్టర్ స్పెసిఫిక్ గా చెప్పారంటే సినిమాలో మంచి మ్యాటర్ ఉన్నట్టే లెక్క.