Begin typing your search above and press return to search.

ఇన్నాళ్ల నా విజయానికి ఫలితం 'సికిందర్‌'

సికిందర్‌ సినిమాకు నిన్న మొన్నటి వరకు పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాలేదు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాటలను విడుదల చేసి టీజర్‌, ట్రైలర్‌ విడుదల తర్వాత ఒకింత బజ్ క్రియేట్‌ అయింది.

By:  Tupaki Desk   |   29 March 2025 3:30 PM
Rashmika About Sikandar
X

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ యానిమల్‌, పుష్ప 2, ఛావా సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ మూడు సినిమాలతో రష్మిక క్రేజ్‌ అమాంతం పెరిగింది. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్న రష్మిక 'సికిందర్‌' సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సల్మాన్‌ ఖాన్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రష్మిక ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం ఆమె ఉన్న ఫామ్‌ నేపథ్యంలో సికిందర్‌ కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు.

సికిందర్‌ సినిమాకు నిన్న మొన్నటి వరకు పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాలేదు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాటలను విడుదల చేసి టీజర్‌, ట్రైలర్‌ విడుదల తర్వాత ఒకింత బజ్ క్రియేట్‌ అయింది. సల్మాన్‌ ఖాన్ వంటి స్టార్‌ హీరోల సినిమాలకు ఈ స్థాయి బజ్ అనేది తక్కువే అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్‌ బుకింగ్‌ ఒక మోస్తరుగా నమోదు అయ్యాయి. సినిమా విడుదల తర్వాత సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాల వారు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సల్మాన్‌ ఖాన్‌, రష్మిక మందన్న మధ్య ఉన్న వయసు తేడా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

ఒక మీడియా సమావేశంలో సల్మాన్‌ ఖాన్‌ తో రిపోర్టర్‌ రష్మిక కంటే మీరు చాలా ఎక్కువ వయసు కదా అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమెకు ఇబ్బంది లేదు కనుక నటించాను. ఆమె ఒప్పుకుంటే ఆమె కూతురుతోనూ నటిస్తాను అంటూ సరదాగా సల్మాన్ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ మధ్య ఈ వయసు తేడా అనేది చాలా కామన్‌ విషయం. బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనూ ఇది కామన్‌ విషయం. కనుక మీడియాలో సికిందర్‌కి వ్యతిరేకంగా ఈ విషయాన్ని రాద్దాంతం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా ఈ విషయమై రష్మిక స్పందించింది. సికిందర్‌ సినిమాలో నటించే ఆఫర్‌ వచ్చిన వెంటనే మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో చాలా సంతోషించాను అంది. సల్మాన్ ఖాన్‌ సర్‌తో నటించే అవకాశం రావడం అనేది గొప్ప విషయంగా చెప్పుకొచ్చింది. నేను ఫస్ట్‌ నటిని కావాలని అనుకోలేదు. కానీ నటిని అయ్యాను. ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించకుండానే ఈ స్థాయికి చేరుకున్నాను. సల్మాన్‌ ఖాన్‌ సర్‌తో నటించే అవకాశం వచ్చింది అంటే కచ్చితంగా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బాగా నటించినట్లు భావిస్తున్నాను. సల్మాన్‌ సర్‌తో నటించే అవకాశం రావడం అనేది నా ఇన్నాళ్ల సినీ కెరీర్‌ విజయానికి ఫలితంగా భావిస్తున్నాను అంది. రష్మిక ప్రస్తుతం సికిందర్‌ ప్రమోషన్‌లో పాల్గొంటుంది. మరో వైపు రెండు మూడు సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది.