గోల్డెన్ లెగ్ రష్మిక స్టార్ హీరో శాపానికి విరుగుడు
రష్మిక గోల్డెన్ లెగ్ ఇటీవల చాలా సినిమాలకు బాగా వర్కవుటవుతోంది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ 'సికందర్'ని కూడా రష్మిక ఆదుకోవాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 17 Jan 2025 11:30 AM GMTరష్మిక ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సక్సెస్ కలిసి వస్తోంది. ఛలో చిత్రంతో నాగశౌర్యకు, గీత గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండకు రష్మిక ప్రధాన అస్సెట్ అయింది. ఈ కన్నడ బ్యూటీ అందచందాలు, నటనకు ప్రజలు ముగ్ధులైపోయారు. అందుకే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత కూడా రష్మిక గోల్డెన్ లెగ్ అంటూ కీర్తినందుకుంది. పుష్ప గ్రాండ్ సక్సెస్ కి ముందే నేషనల్ క్రష్ అంటూ డిక్లేర్ చేయడంతో రష్మిక హవాకు ఎదురే లేకుండా పోయింది. బాలీవుడ్ లో ఆరంగేట్ర చిత్రాలు ఫ్లాపైనా కానీ, రష్మిక హవా ఎంత మాత్రం తగ్గలేదు.
పుష్ప, పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ తో రష్మిక రేంజ్ అమాంతం మారిపోయింది. ఈ కన్నడ బ్యూటీ అడుగుపెడితే చాలు ఆ సినిమా హిట్టేననే సెంటిమెంట్ బలపడింది. రష్మిక గోల్డెన్ లెగ్ ఇటీవల చాలా సినిమాలకు బాగా వర్కవుటవుతోంది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ 'సికందర్'ని కూడా రష్మిక ఆదుకోవాల్సి ఉంటుంది. రష్మిక నటన, ఛామ్ ఈ సినిమాకి ప్రధాన అస్సెట్ కానున్నాయని అభిమానులు భావిస్తున్నారు. అసలు కెరీర్ లో కొన్నేళ్లుగా సరైన హిట్టు అన్నదే లేని రణబీర్ కపూర్ కి 'యానిమల్' లాంటి పాన్ ఇండియా విజయం దక్కిందంటే, ఆ చిత్రంలో రష్మిక గోల్డెన్ లెగ్ వర్కవుటైంది కాబట్టేనని అభిమానులు భావిస్తున్నారు.
ఇప్పుడు సల్మాన్ భాయ్ ని అన్ని శాపాల నుంచి విముక్తుడిని చేసే గోల్డెన్ లెగ్ మన రష్మిక! అని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. గత కొంతకాలంగా బిగ్ బాస్ హిందీ షోలో ప్రచారం చేస్తున్న ఏ సినిమాకి కలిసి రావడం లేదు. రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్', అట్లీ 'బేబీ జాన్, శంకర్ 'గేమ్ ఛేంజర్' ఇవన్నీ పెద్ద ఫ్లాపులుగా మారాయి. ఇప్పుడు సల్మాన్ నటించిన సికందర్ ని కూడా హిందీ బిగ్ బాస్ వేదికగా ప్రచారం చేయబోతున్నారు. అయితే నెగెటివ్ సెంటిమెంట్ ప్రభావంతో సికందర్ కూడా ఫ్లాపయితే పరిస్థితేంటి? అని సల్మాన్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. చాలా కాలంగా హిట్టు అన్నదే లేని భాయ్ కి ఇప్పుడు ఊరట చెందే విజయం కావాలి.
బిగ్ బాస్ ప్రచారం కలిసి రాదు అనే నెగెటివ్ టాక్ ఉన్నా కానీ భాయ్ అదృష్టాన్ని ప్రభావితం చేసే గోల్డెన్ లెగ్ రష్మిక ఉంది కదా! అనే ధీమా ఫ్యాన్స్ లో ఉంది. యానిమల్ తర్వాత 'సికందర్' కూడా పెద్ద హిట్టవుతుందని వారంతా ఆశాభావం కనబరుస్తున్నారు. ఈ వారాంతంలో బిగ్ బాస్ సీజన్ 18 గ్రాండ్ ఫినాలేకు హోస్ట్ సల్మాన్ ఖాన్ తో పాటు, రష్మిక మందన్న సహా సికందర్ చిత్రబృందం హాజరు కావచ్చని పుకార్లు వస్తున్నాయి. ఇదే సమయంలో సెంటిమెంట్ గురించి పెద్ద చర్చ సాగుతోంది. అన్ని శాపాలకు విరుగుడు రష్మిక గోల్డెన్ లెగ్ అంటూ ఫ్యాన్స్ ఉత్సాహం కనబరుస్తున్నారు.