శ్రీవల్లి వేదాంతం.. ఇంతకీ ఏమైంది?
వరుసగా పాన్ ఇండియా విజయాలతో దూసుకుపోతోంది రష్మిక. యానిమల్, పుష్ప 2, చావా లాంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
By: Tupaki Desk | 8 March 2025 3:53 AMవరుసగా పాన్ ఇండియా విజయాలతో దూసుకుపోతోంది రష్మిక. యానిమల్, పుష్ప 2, చావా లాంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. సక్సెస్‌ని మించి తనదైన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. రష్మికపై ప్రజలు, అభిమానుల నుంచి సానుకూల స్పందనలు వ్యక్తమవతున్నాయి. కెరీర్ పరంగా రష్మిక క్షణం తీరిక లేకుండా ఉంది. తదుపరి ఈ బ్యూటీ లైనప్ భారీగా ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన సికందర్ లో రష్మిక నటిస్తోంది. ఈ సినిమా ఈద్ కానుకగా ఈ నెలాఖరున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సికందర్ ప్రచారంలో స్పీడ్ పెంచింది. తాజాగా రష్మిక సానుకూలత గురించి తన అభిమానులతో ముచ్చటించింది. సోషల్ మీడియాల్లో తన అభిమానులను కొంచెం జాలి దయతో ఉండాలని కోరింది. ``మనకు ఈ ఒక్క జీవితం మాత్రమే ఉంది.. కాబట్టి దానిని పూర్తిగా జీవించండి.. కొంచెం దయగా ఉండండి.. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో కష్టాలను ఎదుర్కొంటున్నారు.. ఇతరులకు ప్రేమను ఇవ్వండి.. మిమ్మల్ని మీరు ప్రేమించండి.. మీ శరీరాలకు ప్రేమను ఇవ్వండి..`` అని రష్మిక తన నోట్ లో రాసింది. ఒక పొద్దు తిరుగుడు పువ్వు, పెద్ద మగ్గుతో పానీయం పట్టుకుని ఉన్న తన ఫోటోగ్రాఫ్‌ని షేర్ చేసింది రష్మిక.
అలాగే చివరి నిమిషం మ్యాజిక్ గురించి రష్మిక ప్రస్థావించింది. ``కొన్ని చివరి నిమిషంలోను జరుగుతాయి. మీరే హెయిర్ మేకప్ స్టైలింగ్ చేసుకోవాలి.. నా ప్రాణ స్నేహితుడిని నా ఫోటోలు తీయమని అడగాలి.. ఇవన్నీ చివరి నిమిషంలో జరుగుతాయి... నాకు అది చాలా ఇష్టం!! ఇలాంటివి కాలేజీ రోజులకు తీసుకెళతాయి`` అని రష్మిక ఇన్ స్టాలో రాసింది. గోల్డ్ శారీ, బ్లూ బ్లౌజ్ లో అందంగా కనిపించిన రష్మిక బంగారం ఝుమ్కాలతో అందంగా కనిపించిన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారింది.
నెలాఖరున సికందర్ విడుదల కానుండగా, మరోవైపు ధనుష్- శేఖర్ కమ్ములతో `కుబేర` విడుదల ప్రచారం కోసం రష్మిక సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానా తో `థామ` లాంటి క్రేజీ ప్రాజెక్టులోను రష్మిక నటిస్తోంది. తెలుగు దర్శకులు వినిపించిన కొన్ని కథల్ని ఫైనల్ చేసే పనిలో ఉందని కూడా తెలుస్తోంది.