ఫోటో స్టోరి: నేషనల్ క్రష్ కాదు కోతి పిల్ల!
తనను తాను ఒక మంకీ టైప్ అని రష్మిక వర్ణించింది. నేనొక కోతి పిల్లలా అల్లరి చేస్తానని ఒప్పుకుంది.
By: Tupaki Desk | 27 March 2025 3:37 AMఈ ఫోటోలో ఉన్న అమ్మడు ఎవరో చెప్పగలరా? నేషనల్ క్రష్.. కొంటె పిల్ల.. కూర్గ్ బ్యూటీ....!! అభిమానులు చాలా సులువుగా ఇవన్నీ చెప్పగలరు. కానీ రష్మిక మందన్న స్వయంగా చెప్పిన మాట వింటే షాకింగే..! తనను తాను ఒక మంకీ టైప్ అని రష్మిక వర్ణించింది. నేనొక కోతి పిల్లలా అల్లరి చేస్తానని ఒప్పుకుంది.
ఇదిగో ఇలా నాలుకను బయటపెట్టి మంకీలా ఫోజిచ్చింది. ఈ లుక్కులో బ్లాక్ షర్ట్.. బ్లాక్ రేబాన్ ధరించిన రష్మిక ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నా, తన ఊహించని ఫోజ్ పై మాత్రం కుర్రకారుకు అభ్యంతరం ఉంది. ఎదుటివారిని టీజ్ చేస్తూ అలా నాలుక బయట పెట్టి వెక్కిరిస్తోంది ఎందుకని? చాలా మంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఇలా వెక్కిరించే కోతి బొమ్మను పెట్టుకుంటారు కదా! ఇకపై ఆ కోతి బొమ్మ తీసేసి.. ఆ స్థానంలో రష్మిక కోతి వేషాన్ని తగిలించేస్తారేమో! అనే డౌట్లు పెట్టుకుంటున్నారు.
''ఉమ్మ్.. మీరే చెప్పొచ్చు....ఇదే నిజమైన నేను! అంటూ మంకీ (కోతి పిల్ల) ఈమోజీని షేర్ చేసింది రష్మిక మందన్న. ఈ ఫోటోని చూశాక రష్మికలోని కొంటెతనం చిలిపిదనాన్ని అంచనా వేయొచ్చు. చూస్తుంటే సికందర్ (సల్మాన్ భాయ్) సరసన ఇలాంటి కొంటె వేషాలు చాలా వేసి ఉంటుందని డౌట్ కొడుతోంది. తనకంటే 30 ఏళ్లు అధిక వయసు ఉన్న స్టార్ తో నటించింది రష్మిక. సల్మాన్ - రష్మిక జంట వయసు వ్యత్యాసంపై చాలా చర్చ సాగుతోంది. కానీ ఇది మురుగదాస్ ఎంపిక. ఈద్ కానుకగా విడుదలవుతున్న సికందర్ విజయంపై సల్మాన్, మురుగదాస్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కొన్ని వరుస పాన్ ఇండియా విజయాలతో అసాధారణ స్టార్ డమ్ ని ఛేజిక్కించుకున్న రష్మిక మరో కమర్షియల్ విజయంపై కన్నేసింది. కానీ కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్న ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.