రష్మిక.. కనీసం పెళ్లికి అయినా గంట టైమిస్తుందా?
ప్రయాణ సమయాన్ని కూడా అక్కడ స్నేహితురాలి కోసం కేటాయించలేకపోయింది.
By: Tupaki Desk | 21 Dec 2024 6:15 AM GMT'పుష్ప 2 ది రూల్' అద్భుత విజయాన్ని ఆస్వాధిస్తోంది రష్మిక మందన్న. ఈ సమయంలో తన వ్యక్తిగత కమిట్ మెంట్లను కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ కార్యక్రమానికి రష్మిక హాజరయ్యారు. సంగీత్ వేడుక కోసం గంటసేపు ప్రయాణించి కేవలం 15 నిమిషాలు మాత్రమే అక్కడ సమయం గడిపానని చెప్పారు. ప్రయాణ సమయాన్ని కూడా అక్కడ స్నేహితురాలి కోసం కేటాయించలేకపోయింది. వెంటనే తిరుగు ప్రయాణం అయ్యానని తెలిపింది.
స్నేహితురాలి సంగీత్ కార్యక్రమం నుంచి ఫోటోలను కూడా రష్మిక షేర్ చేసారు. పొడవాటి కుర్తా, పైజామా, దుపట్టాతో ఆకర్షణీయమైన దుస్తుల్లో రష్మిక ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈవెంట్ కి సంబంధించిన ఓ మూడు ఫోటోలు అంతర్జాలంలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.
''వరుస కమిట్‌మెంట్ల కారణంగా ఈ వేడుకలో ఎక్కువ సమయం గడపలేకపోయానని రష్మిక వెల్లడించారు. నా బెస్టీ శ్రావ్యవర్మ సంగీత్ కోసం.. గంట పాటు అటూ ఇటూ ప్రయాణించాను. కేవలం 15 నిమిషాలు మాత్రమే వేడుకలో ఉన్నాను. కానీ తనను కలిసినందుకు గర్వంగా ఉంది'' అని రష్మిక సోషల్ మీడియాలో రాసారు.
మై హీరోయిన్ మూమెంట్... సరైన సమయానికి అసైన్‌మెంట్ కోసం చేరుకునే మోడల్స్, నటీనటులు ఎల్లపుడూ ఆకర్షిస్తారు. అనుకున్నది సాధించడానికి నేను నా జీవితంలో నిజంగా చాలా కష్టపడ్డాను. నేను-కొంతవరకు-సాధించానని అనుకుంటున్నాను అని రష్మిక తెలిపింది. సరైన వ్యక్తులతో కలిసి పని చేయడం కూడా ముఖ్యం. తెరవెనక పని చేసే సాంకేతిక నిపుణుల సాయంతోను ఇదంతా సాధ్యమైంది అని వెల్లడించింది.