Begin typing your search above and press return to search.

నేషనల్ క్రష్.. ఎన్నాళ్లీ దాగుడు మూతలు..?

ఐతే కెరీర్ పరంగా ఎలాంటి డౌట్ లేకుండా వెళుతున్న రష్మిక పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వెనుకబడి ఉంది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 10:30 PM GMT
నేషనల్ క్రష్.. ఎన్నాళ్లీ దాగుడు మూతలు..?
X

స్టార్ హీరోయిన్ గా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న తను చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవ్వడంతో కెరీర్ ఫుల్ ఫాం కొనసాగిస్తుంది. రష్మిక సినిమాలో ఉంది అంటే అది కచ్చితంగా హిట్టే అనే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఐతే కెరీర్ పరంగా ఎలాంటి డౌట్ లేకుండా వెళుతున్న రష్మిక పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ప్రేమ, పెళ్లి విషయంలో ఎప్పుడు అడిగినా ఇప్పుడు దానికి టైం లేదన్న సమాధానం ఇస్తుంది రష్మిక.

ఐతే లేటెస్ట్ గా ప్రేమ ఇంకా పెళ్లి బంధం మీద తన మార్క్ కామెంట్స్ చేసింది రష్మిక. తనలానే ఆలోచించే మనస్తత్వం కలవాడిని తాను చేసుకోవాలని అనుకుంటుందట. అంతేకాదు అన్ని విషయాల్లో తోడుగా ఉండి.. భద్రత ఇవ్వాలని అంటుంది. కష్టమైన సమయాళ్లో అతని సపోర్ట్ కావాలని ఔంటుంది రష్మిక. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ మంచి మనసుతో బాధ్యతగా ఉండాలని తనకు కాబోయే వాడి గురించి చెప్పింది రష్మిక.

ఐతే ఇప్పటికే ఆ క్వాలిటీస్ ఉన్న వాడు దొరికేశాడని మీడియా కోడై కూస్తుంది. రష్మిక ఎవరిని ప్రేమిస్తుంది.. ఆమె ఎవరిని ఫాలో అవుతుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ మళ్లీ అలాంటి వాడు కావాలి.. ఇలాంటి వాడు కావాలని మెలికలు తిరుగుతుంది. మరి ఆల్రెడీ తనకు కావాల్సిన వాడిని ఎంపిక చేసుకున్నాక కూడా ఈ దాగుడు మూతలు ఎందుకు అన్నది అర్థం కావట్లేదు. ప్రేమ ఉండటం అంటేనే భాగస్వామిని కలిగి ఉండటం అని దాదాపు తను డేటింగ్ లో ఉన్న విషయాన్ని చూచాయగా చెప్పేస్తుంది రష్మిక.

ఐతే ఆ హీరో.. ఈ హీరోయిన్ ఎప్పుడు ఇలా మీ ఇష్టం మీరు ఏది ఊహించుకుంటే అదే అన్నట్టుగా వదిలేస్తారు. ఈమధ్యనే తనకు కాబోయే వాడు అతనే అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చగా ఉన్న అతని గురించి చెప్పకనే చెప్పింది రష్మిక. మరి ఇద్దరు ఎప్పుడు వారి ప్రేమను కన్ ఫర్మ్ చేసి అనౌన్స్ చేస్తారా అని వారి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే ఏదో ఒక రోజు సడెన్ గా ఇద్దరు ఎంగేజ్మెంట్ తో సర్ ప్రైజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. 2025 పెళ్లి చేసుకోబోయే జంటల్లో వీరిది కూడా ఒకటని ఆడియన్స్ లో కొందరు గట్టిగా నమ్ముతున్నారు.