Begin typing your search above and press return to search.

బ్లాక్ శారీలో శ్రీవల్లి స్టన్నింగ్ షో!

హీరోయిన్ రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Dec 2024 6:30 AM GMT
బ్లాక్ శారీలో శ్రీవల్లి స్టన్నింగ్ షో!
X

హీరోయిన్ రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ బేస్ దక్కించుకున్న అమ్మడు.. నేషనల్ క్రష్ గా మారిపోయింది. అందరి దృష్టిని తన అప్ కమింగ్ చిత్రాల వైపు తిప్పుకుంటూనే ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.

రీసెంట్ గా పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి శ్రీవల్లి రోల్ లో తనదైన శైలిలో మెప్పించారు. డ్యాన్స్, యాక్టింగ్, ఎక్సప్రెషన్స్.. అలా ప్రతి విషయంలో కూడా అదరగొట్టేస్తూ.. తన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను వేసుకుంది. పుష్ప 2: ది రూల్ కు గాను ఎందరో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు పుష్ప-2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక అదే సమయంలో తన కొత్త చిత్రాలు పూర్తి చేస్తున్నారు. రీసెంట్ గా ఆమె యాక్ట్ చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా విభిన్నమైన లవ్ స్టోరీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

గర్ల్ ఫ్రెండ్ తో పాటు సల్మాన్ ఖాన్ తో సికిందర్, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేరలో యాక్ట్ చేస్తున్నారు. హారర్ కామెడీ మూవీ థామాలో, రెయిన్ బోలో కూడా భాగమయ్యారు. ఇప్పటికే నటించిన చావా రిలీజ్ కు రెడీ ఉంది. అలా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు రష్మిక. తరచూ కొత్త పిక్స్ ను షేర్ చేస్తుంటారు.

అటు మోడ్రన్.. ఇటు ట్రెడిషనల్ గా సందడి చేస్తూనే.. తన ఫాలోవర్స్ ను వేరే లెవెల్ లో పెంచేసుకుంటోంది. తాజాగా హీరోయిన్ మూమెంట్ అంటూ బ్లాక్ శారీలో దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది. తాను చాలా కష్టపడి మంచి పొజిషన్ కు వచ్చానని చెనుతూ అందంగా స్టిల్స్ ఇచ్చింది. అయితే ప్లెయిన్ శారీలో రష్మిక అదిరిపోయారని.. బ్యాక్ పోజ్ తో మైమరిపించారని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె పిక్స్ వైరల్ గా మారగా.. శ్రీవల్లి రాబోయే రోజుల్లో మరిన్ని హిట్స్ అందుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు.