కథ నచ్చితే బామ్మ పాత్ర అయినా చేస్తా: రష్మిక
రష్మిక ఏ ముహూర్తాన ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైందో కానీ అప్పటినుంచి అమ్మడు వరుస అవకాశాలతో వెనక్కు తిరిగి చూసుకునే పని లేకుండా ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది.
By: Tupaki Desk | 14 Feb 2025 1:30 PM GMTరష్మిక ఏ ముహూర్తాన ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైందో కానీ అప్పటినుంచి అమ్మడు వరుస అవకాశాలతో వెనక్కు తిరిగి చూసుకునే పని లేకుండా ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. బెంగుళూరు బ్యూటీ నుంచి నేషనల్ క్రష్ గా ఎదిగిన రష్మిక పుష్ప, యానిమల్, పుష్ప2 సినిమాలతో తన క్రేజ్ ను నేషనల్ వైడ్ లో చాటుకుంది.
రష్మిక బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చేసిన ఛావా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కథ బావుంటే తాను నలుగురు పిల్లల తల్లి పాత్రలో, బామ్మ పాత్రలో అయినా నటిస్తానని, కథలో భాగం కావాలనుకున్నప్పుడు పాత్ర గురించి అసలు పట్టించుకోనని రష్మిక తెలిపింది.
తన సినిమాలు వరుసగా సక్సెస్ అవుతుండటంతో అందరూ ఏదో స్పెషల్ ప్లాన్ చేశాననుకుంటారని, కానీ తన విజయం వెనుక ఎలాంటి ప్లాన్స్ లేవని, అదృష్టం వల్లే తన సినిమాలు ఆడియన్స్ కు నచ్చుతున్నాయని, హిట్ సినిమాల్లో భాగం కావడం తన అదృష్టమని, ప్రేక్షకులు ఆ పాత్రల్లో తనను ఇష్టపడటం తనకెంతో సంతోషాన్నిస్తుందని రష్మిక ఈ సందర్భంగా తెలిపింది.
తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ, లైఫ్ లో తాను దేన్నీ సీరియస్ గా తీసుకోనని, ప్రతీదీ ఆలోచించడం మొదలుపెడితే లైఫ్ చాలా కష్టంగా అనిపిస్తుందని అందుకే పెద్దగా ఆలోచించనని, కాలంతో పాటూ ముందుకెళ్తూ, నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని చెప్తున్న రష్మిక ఏదో శక్తి తనను నడిపిస్తుందని నమ్ముతానంటోంది.
ఇక ఛావా సినిమా గురించి చెప్తూ, యేసుబాయి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నానంది రష్మిక. యేసుబాయి లాంటి గొప్ప మహారాణి పాత్రలో నటిస్తానని తానెప్పుడూ అనుకోలేదని చెప్పింది. ఇదిలా ఉంటే రష్మిక చేతిలో ప్రస్తుతం సికిందర్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో పాటూ రెయిన్ బో కూడా ఉంది.