Begin typing your search above and press return to search.

స్పీడుమీదున్న నేషనల్ క్రష్ కు సడన్ బ్రేక్

ఈ గాయం వల్ల కొంత కాలం షూటింగ్‌కు దూరమైనప్పటికీ, త్వరలోనే ఆమె తిరిగి సెట్స్‌పై అడుగుపెట్టనుంది. గత ఏడాది ఆమె గ్యాప్ లేకుండా షూటింగ్స్ లలో పాల్గొంది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 2:30 PM GMT
స్పీడుమీదున్న నేషనల్ క్రష్ కు సడన్ బ్రేక్
X

సౌత్ ఇండస్ట్రీలో తన అందం, నటనతో తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. ఆమె టాలెంట్ వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కిరాక్ పార్టీ'తో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి విస్తరించింది. 'గీత గోవిందం'తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన రష్మిక, 'సరిలేరు నీకెవ్వరు' 'భీష్మ' 'పుష్ప' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. తాజాగా 'పుష్ప 2'తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ సక్సెస్ అందుకుంది.

'పుష్ప 2' చిత్రంతో రష్మిక మాస్ ఆడియన్స్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన ఈ సినిమాలో ఆమె పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. సాంగ్స్ లో కూడా అమ్మడు తన టాలెంట్ గ్లామర్ ను మరింత బలంగా హైలెట్ చేసింది. మొత్తానికి పాన్ ఇండియా రేంజ్‌లో తన గుర్తింపు పెంచుకుంది. ఈ సినిమా సక్సెస్ తరువాత రష్మిక పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇప్పుడు రష్మిక హిందీలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న 'సికందర్' అనే సినిమాతో మరో లెవెల్ కు వెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పుష్ప 2 అనంతరం మరింత స్పీడ్ లో ఉన్న రష్మికకు ఇటీవల గాయం వలన సడన్ బ్రేక్ పడింది. తాజా సమాచారం ప్రకారం, రష్మిక షూటింగ్‌లో పాల్గొనడానికి ముందే జిమ్‌లో తీవ్ర గాయం అయిందట. వైద్యుల సలహా మేరకు ఆమెకు తక్షణ విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక నెమ్మదిగా కోలుకుంటున్నట్లు సమాచారం.

ఈ గాయం వల్ల కొంత కాలం షూటింగ్‌కు దూరమైనప్పటికీ, త్వరలోనే ఆమె తిరిగి సెట్స్‌పై అడుగుపెట్టనుంది. గత ఏడాది ఆమె గ్యాప్ లేకుండా షూటింగ్స్ లలో పాల్గొంది. ఇక ఇప్పుడు గాయంతో కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. సల్మాన్ ఖాన్, సాజిద్ నడియాద్వాల నిర్మాణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఈద్ 2025కి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సల్మాన్ కూడా ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

రష్మిక చేతిలో ప్రస్తుతం తెలుగులో కూడా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర్,' రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న లేడి ఓరియెంటెడ్ సినిమా, అలాగే హిందీలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో ఆమె నటించనుంది. ఈ ప్రాజెక్టులన్నీ రష్మికను బిజీగా ఉంచుతున్నాయి. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా టాప్ హీరోయిన్‌గా రష్మిక స్థిరపడుతోంది. పుష్ప 2 క్రేజ్‌ తర్వాత ఆమె రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగింది.