నేషనల్ క్రష్ కెరీర్ లో తొలి హ్యాట్రిక్!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Feb 2025 2:30 PM GMTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే `ఛావా` సక్సెస్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ విజయంతో రష్మిక కెరీర్ లో సరికొత్త రికార్డులు నమోద య్యాయి. రష్మిక కెరీర్ లో ఇంతవరకూ హ్యాట్రిక్ నమోదు కాలేదు. తొలిసారి `ఛావా` విజయంతో అది సాధ్యమైంది. `యానిమల్`, `పుష్ప-2` తర్వాత రిలీజ్ అయిన ఛావా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రికార్డు నమోదైంది.
అమ్మడి కెరీర్ లో చాలా విజయాలున్నాయి. కానీ ఆ విజయాలు వరుసగా లేవు. శాండిలవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ మూడు భాషల్లోనే ఇదే తరహాలో విజయాలు అందుకుంది. అయితే బాలీవుడ్ చిత్రం `ఛావా`తో హ్యాట్రిక్ నమోదవ్వడం ఒక ఎత్తైతే? రష్మిక కెరీర్ లో తొలి చారిత్రాత్మక చిత్రం విజయం సాధించడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
`యానిమల్` చిత్రం రష్మిక కెరీర్ లో తొలి 900 కోట్ల వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత రిలీజ్ అయిన పుష్ప ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద `ఛావా` హవా కొనసా గుతుంది. ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని ఓ అంచనా. అంతకు మించి 500 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన `సికిందర్` లో నటిస్తోంది.
అలాగే `థామా`లోనూ నటిస్తోంది. శేఖర్ కమ్ములా తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కుభేర` లోనూ నటిస్తోంది. `సికిందర్`, `కుభేర`పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలు కూడా విజయం సాధిస్తే? రష్మిక వేగాన్ని ఆపడం అసాధ్యమే.