మూడు చోట్ల కాలికి ఫ్రాక్చర్.. అందుకే అంత ఇబ్బంది..
పైకి అందంగా కనిపించినా లోన బాధగా ఉన్నాను. నా కాళ్లపై నేను నిలబడలేకపోతున్నాను.. అంటూ ఆవేదన చెందింది రష్మిక.
By: Tupaki Desk | 26 Jan 2025 6:29 AM GMTవేదికలపై కుంటుతూ నానా అవస్తలు పడుతోంది రష్మిక మందన్న. ఇంతకుముందు ఎయిర్‌పోర్ట్ లో వీల్ చైర్ లో కనిపించి ఆశ్చర్యపరిచిన రష్మిక మందన్న, ఆ తర్వాత చావా ట్రైలర్ లాంచ్ వేదికపై కుంటుతూ ఇతరుల సాయం తీసుకుంటూ చాలా ఇబ్బంది పడింది. ఆ దృశ్యాలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. సహనటుడు విక్కీ కౌశల్ తనను జాగ్రత్తగా నడిపించేందుకు ప్రయత్నించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే రష్మిక మందన్న నడవలేనంతగా తన కాలికి ఏమైంది? అంటే.. అసలు నిజం ఇప్పుడు బయటపడింది. జిమ్ లో ఏదో చిన్న గాయమే అయింది! అని అనుకుంటే పొరపాటే.. రష్మిక కాలికి మూడు చోట్ల కండరాలు ఫ్రాక్చర్ (కన్నం పడింది) అయిందని తెలిసింది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా చెప్పడం షాకిచ్చింది.
హిస్టారికల్ డ్రామా 'చావా'లో ఏసుభాయి పాత్రలో నటించడం గౌరవం. కానీ కాలికి మూడు ఫ్రాక్చర్లు ఉన్నాయి.. కండరాలు చినిగేంత గాయమైంది. రెండు వారాలు కాలు కింద పెట్టలేను. పైకి అందంగా కనిపించినా లోన బాధగా ఉన్నాను. నా కాళ్లపై నేను నిలబడలేకపోతున్నాను.. అంటూ ఆవేదన చెందింది రష్మిక. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ అందరి ప్రేమ బలాన్ని నేను చాలా ప్రేమగా స్వీకరించాను అని రష్మిక అన్నారు. జిమ్ లో గాయం కారణంగా కొన్ని వారాల పాటు షూటింగులకు వెళ్లలేని పరిస్థితి ఉందని కూడా రష్మిక తెలిపింది.
ఈ ఆకస్మిక ఇబ్బంది కారణంగా షూటింగుల ఆలస్యానికి రష్మిక తన దర్శకులకు క్షమాపణలు కూడా చెప్పింది. విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రలో నటించిన చావా త్వరలో విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్న రాణి పాత్రలో నటించింది.