రీల్ అండ్ రియల్ లైఫ్ మధ్య రష్మిక క్లారిటీ ఇలా!
ఈ విషయాన్ని నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా బాగానే వంట పట్టించు కుంది. ఇండస్ట్రీలో స్టార్ డమ్.. ప్రజాదారణ..డబ్బు ఏదీ శాశ్వతం కాదని అంటోంది.
By: Tupaki Desk | 26 Jan 2025 12:30 PM GMTసినిమా అన్నది ఓ మాయా ప్రపంచం. ఖరీదైన జీవితం..రంగుల ప్రపంచం మనిషినే మార్చేస్తుంది. సినిమా రంగంలో ఎంతో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాలెన్సింగ్ అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుంది? అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇండస్ట్రీ ఎంత వేగంగా ఆకాశానికి ఎత్తగలతో? అంతకు మించిన వేగంతో పాతాళానికి తొక్కేయగలదు. క్రమశిక్షణ అన్నది మాత్రమే ఎక్కడైనా పైకి తీసుకు రాగలదు.
ఇండస్ట్రీలో అది ఎక్కువగా ఉంటే? జీవితం అంత గొప్పగానూ సాగుతుంది. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి నవతరాన్ని ఉద్దేశించి చెబుతుంటారు. ఈ విషయాన్ని నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా బాగానే వంట పట్టించు కుంది. ఇండస్ట్రీలో స్టార్ డమ్.. ప్రజాదారణ..డబ్బు ఏదీ శాశ్వతం కాదని అంటోంది. ప్రోపెషనల్ గా ఎంత గొప్ప జీవితమైనా? వ్యక్తిగతంగా తానెంత సంతోషంగా ఉన్నానన్నదే ముఖ్యమంటోంది.
కుటుంబానికి ఇప్పుడు కావాల్సినంత సమయాన్ని కేటాయించకలేకపోయినా? కుటుంబాన్నే మర్చిపోయేంత బిజీగా ఉన్నా? డబ్బు చేతిలో ఉన్నా? కుటుంబ విలువలకు..మూలాలకు మాత్రం తానెప్పుడు మొదటి ప్రాముఖ్య తనిస్తానని తెలిపింది. ప్రతీ నటీ, నటుడు వారి జీవితంలో ఏదో ఒక దశలో ప్రతికూల పరిస్థితులు...క్షీణత ఎదుర్కో వాల్సి ఉంటుందని...ఇప్పుడెలా ఉన్నాం అన్నది ఎంత ముఖ్యమో! అదుపు తప్పితే ఎలా ఉంటాం? అన్నది కూడా ఆలోచించుకుని ముందుకు వెళ్లాలంటోంది.
వాస్తవ జీవితంలో ఎల్లుప్పుడు తోడు ఉండే వాళ్లను ఎప్పుడూ మర్చిపోకూడదని కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు వారంతా ప్రోఫెషనల్ లైఫ్ కంటే ముఖ్యమని అభిప్రాయపడింది. సినిమా అనేది తన జీవితంలోకి అనుకోకుండా వచ్చిందని... ఇప్పుడా జీవితం బాగుందని తొలి జీవితాన్ని ఎలా మర్చిపోతానని తనని తానే ప్రశ్నించుకుంది. మొత్తానికి వృత్తి-వ్యక్తిగత జీవితంలో రష్మిక పక్కా క్లారిటీతో ఉందని తెలుస్తోంది.