Begin typing your search above and press return to search.

రష్మిక ఇప్పుడు వాళ్ల కంటే తక్కువేం కాదు!

గత సంవత్సరం చివరిలో అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   18 Feb 2025 6:22 AM GMT
రష్మిక ఇప్పుడు వాళ్ల కంటే తక్కువేం కాదు!
X

నేషనల్ క్రష్‌ రష్మిక మందన 'చావా' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత సంవత్సరం చివరిలో అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రష్మిక మందన తాజాగా బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి చావా సినిమాతో వచ్చింది. చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చావా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలో విక్కీ కౌశల్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇదే సమయంలో రష్మిక నటనపై పలువురి ప్రశంసలు కురిపించారు. సినిమాలో ఆమె పాత్రకి పూర్తి న్యాయం చేసే విధంగా నటించింది అంటూ రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్‌లో యానిమల్ సినిమాతోనూ రష్మిక మందన ఆకట్టుకుంది. ఆ సినిమా వెయ్యి కోట్లకు పైకి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్‌లో రష్మిక మందన మరిన్ని సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ తీసుకుంటున్నంత పారితోషికం మాత్రం రష్మిక మందన పొందడం లేదు.

దీపిక పడుకునే, ఆలియా భట్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ లో రష్మిక మందన కనీసం సగం మాత్రమే తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ దాదాపుగా ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటుంది. చావా సినిమా కోసం తీసుకున్న పారితోషికం నాలుగు కోట్లు మాత్రమే అని సమాచారం అందుతుంది. ముందు ముందు అయినా రష్మిక మందన తన పారితోషికాన్ని ఎనిమిది నుంచి పది కోట్లుగా పెంచాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా రష్మిక మందన తన పారితోషికం అందుకోవాలని అభిమానులు, సౌత్ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ హీరో హీరోయిన్ దాదాపు సమానంగా పారితోషికం అందుకుంటారు. కానీ రష్మిక విషయంలో ఆ ఫార్ములా అమలు కావడం లేదు. సల్మాన్ ఖాన్ తో ప్రస్తుతం నటిస్తున్న సినిమాకి సైతం రష్మిక మందన రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంది. అందుకే బాలీవుడ్లో రష్మిక కొత్త సినిమాలను కమిట్ అయితే పారితోషికం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సినిమా సైతం సక్సెస్ అయితే రష్మిక మందన బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అప్పుడైనా పారితోషికం పెంచుతుందా అనేది చూడాలి.