Begin typing your search above and press return to search.

నువ్వు హైదరాబాద్‌ అమ్మాయివి ఎలా అయ్యావ్‌?

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా రష్మిక నటించిన 'చావా' సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   15 Feb 2025 6:32 AM GMT
నువ్వు హైదరాబాద్‌ అమ్మాయివి ఎలా అయ్యావ్‌?
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా రష్మిక నటించిన 'చావా' సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. చావా సినిమాతో బాలీవుడ్‌లో రష్మిక మరో విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో రష్మిక 'చావా' సినిమాలో చక్కగా నటించింది అనే ప్రశంసలు సైతం దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో రష్మిక ముందు ముందు మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక మందన్న తాజాగా చావా సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ తాను హైదరాబాద్‌ నుంచి వచ్చాను అని, ఇక్కడ ఇంత మందిని చూసి మీరు నా కుటుంబ సభ్యులు అనే భావన కలుగుతుందని సంతోషం వ్యక్తం చేసింది. తాను హైదరాబాద్‌ నుంచి వచ్చాను అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలో పుట్టిన నువ్వు హైదరాబాద్‌ అమ్మాయిగా ఎలా మారావు, హైదరాబాద్‌ అమ్మాయి ఎలా అయ్యావు అంటూ కన్నడ నెటిజన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన వారు చాలా మంది రష్మిక తీరుపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే.

హైదరాబాద్‌ అమ్మాయిని అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత మందికి ఆమెను శత్రువును చేసింది. కన్నడంలో సినీ కెరీర్‌ ఆరంభించి, కర్ణాటకలో పుట్టి పెరిగిన రష్మిక ఎందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చాను అంటూ చెప్పింది అనే విషయం అర్థం కావడం లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ విషయమై తీవ్ర దుమారం రేగుతోంది. ముందు ముందు ఈ విషయమై రష్మిక పెద్ద స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ అబ్బాయిని పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో రష్మిక అలా చెప్పి ఉంటుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

రష్మిక మందన్న గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. ఆమె ఎవరితో ప్రేమలో ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉంది, ఇద్దరి వివాహం గురించి ప్రకటన ఏ సమయంలో అయినా రావచ్చు. పెళ్లి అయినా సరే తాను కర్ణాటక అమ్మాయిని అని చెప్పుకుంటే అందరికీ గౌరవంగా ఉంటుంది. కానీ రష్మిక పెళ్లికి ముందే హైదరాబాద్‌ నుంచి వచ్చాను అంటూ చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆమె స్పందన ఏంటి అనేది చూడాలి. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఏ భాషకు వెళ్లినా అక్కడి వారిని ఫ్యామిలీగా అనుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలా తన సొంత ప్రాంతాన్ని మార్చేయడం రష్మికకే చెల్లిందని కన్నడ నెటిజన్స్‌ దుమ్మెత్తి పోస్తున్నారు.