మొదటి సినిమా నుంచే నేషనల్ క్రష్ ట్యాగ్ మొదలైంది: రష్మిక
పుష్ప సినిమాతో రష్మిక ను అందరూ నేషనల్ క్రష్ చేసేశారు. పుష్ప మూవీతో రష్మిక వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 1:30 AM GMTరష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయనవసరం లేదు. టాలీవుడ్ లో వరుస విషయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బెంగుళూరు బ్యూటీ, యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. పుష్ప సినిమాతో రష్మిక ను అందరూ నేషనల్ క్రష్ చేసేశారు. పుష్ప మూవీతో రష్మిక వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.
ఎవరైనా హీరోయిన్ నచ్చితే ఆమెను క్రష్ అనుకోవడం మామూలే. కానీ దేశం మొత్తంలో మెజారిటీ యూత్ కు ఒకే హీరోయిన్ ను క్రష్ అనుకోవడంతో రష్మిక కు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ వచ్చింది. తాజాగా నేషనల్ క్రష్ ట్యాగ్ పై రష్మిక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. తన మొదటి సినిమా కిరిక్ పార్టీతోనే తనకు ఆ టైటిల్ స్టార్ట్ అయినట్టు రష్మిక వెల్లడించింది.
కాలేజ్ మొత్తానికి తానే క్రష్ గా ఉండేదాన్నని చెప్పిన రష్మిక తర్వాత కర్ణాటకకు క్రష్ గా మారానని, ఆ తర్వాత మెల్లిగా అది నేషనల్ క్రష్ అయిపోయినట్టు తెలిపింది. ఇప్పుడు ఆడియన్స్ తన దగ్గరకొచ్చి దేశం మొత్తానికి నువ్వంటే చాలా ఇష్టమని, అందరి మనసులో నువ్వున్నావని చెప్తున్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా స్పెషల్ గా ఉందని రష్మిక తెలిపింది.
అంతేకాదు, ఇప్పుడు తాను అందరి జీవితాల్లో, అందరి మనసుల్లో భాగమైనట్టు రష్మిక వెల్లడించింది. ప్రస్తుతం ఛావా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక ఈ సినిమాలో నటించడంపై ఆనందం వ్యక్తం చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా సినిమాను శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీగా నటించగా, ఆయన భార్య యేసుబాయ్ పాత్రలో రష్మిక నటించింది.
ఇది కాకుండా రష్మిక సల్మాన్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో సికిందర్ అనే సినిమా కూడా చేస్తోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మార్చిలో సికిందర్ రిలీజ్ కానుంది. దాంతో పాటూ తెలుగులో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాల్లో కూడా రష్మిక నటిస్తోంది.