చెల్లితో చాటింగ్..ఫ్యామిలీతో మీటింగ్ లేక రష్మిక ఇలా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడెంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.
By: Tupaki Desk | 25 Jan 2025 7:58 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడెంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. తెలుగు, తమిళం, హిందీ అంటూ ముంబై టూ చెన్నై, హైదరాబాద్ లో జర్నీలు చేస్తోంది. నటన విషయంలో తానెంత డెడికేటేడ్ అన్నది ఇటీవలే శేఖర్ కమ్ములా కూడా రివీల్ చేసారు. ఈ నేపథ్యంలో రష్మిక ఫ్యామిలీని మిస్ అవుతున్నానే బాధని వ్యక్తం చేసింది. `కుటుంబమంటే నాకోంతో ఇష్టం.
కీలక సమయాన్ని వాళ్లతోనే గడుపుతాను. బిజీగా ఉండటం వల్ల అవన్నీ మిస్ అవుతున్నాను. ఈ విషయంలో నేను చాలా రాజీ పడాల్సి వస్తోంది. వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఒకరేసారి సమయాన్ని కేటాయించడం కుదరని అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు నాజీవితంలో జరుగుతోంది అదే. కొన్ని కావాల నుకుంటే జీవితంలో కొన్నింటిని త్యాగం చేయకతప్పదు.
నా తల్లిదండ్రులు...చెల్లిని ఎంతో మిస్ అవుతున్నా. నాకు చెల్లి అంటే ఎంతో ఇష్టం. ఇద్దరం రోజూ చాటింగ్ చేసు కుంటాం. కానీ వరుస షూటింగ్స్ వల్ల ఆ చాటింగ్ కూడా చేయలేకపోతున్నా. ఉదయమంతా షూటింగ్. ఇంటికి వచ్చే సరికి అలసిపోవడం తో నిద్రపోవడం ఇదే దినచర్యగా మారిపోయింది` అంది. ఎంత బిజీగా ఉంటే అంత సంపాదన అన్నట్లు! రష్మిక ఇప్పుడు భారీగానే సంపాదిస్తోంది. పాన్ ఇండియా విజయాలతో స్టార్ డమ్ రెట్టింపు అయింది.
అందుకు తగ్గట్టే పారితోషికం అందుకుంటుంది. ఇంకా నిర్మాతలు అదనంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇదంతా ఫేం ఉన్నంత కాలమే. ఫేం కోల్పోయిన తర్వాత మళ్లీ సాధారణ జీవితమే. ఇటీవలే `పుష్ప-2` తో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. దీంతో బాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి.