Begin typing your search above and press return to search.

నేషనల్ క్రష్.. కమిట్మెంట్ అదుర్స్..!

బాలీవుడ్ లో యానిమల్ హిట్ తో ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న అమ్మడు నెక్స్ట్ పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ లైన్ లో పెట్టింది.

By:  Tupaki Desk   |   1 Dec 2024 3:40 AM GMT
నేషనల్ క్రష్.. కమిట్మెంట్ అదుర్స్..!
X

నేషనల్ క్రష్ రష్మిక కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. బాలీవుడ్ లో యానిమల్ హిట్ తో ఒక రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న అమ్మడు నెక్స్ట్ పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ లైన్ లో పెట్టింది. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ కు ఫుల్ సపోర్ట్ గా రష్మిక ఎక్కడ ప్రమోషన్స్ పెడితే అక్కడ ప్రత్యక్షమవుతుంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ ఏంటన్నది తెలిసేలా చేస్తుంది.

పుష్ప 1 సినిమా వచ్చి 3 ఏళ్లు అవుతుంది. ఇక పార్ట్ 2 కోసం ఈ మూడేళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఐతే రష్మిక మందన్న పుష్ప 2 కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వేరే సినిమాల కమిట్ మెంట్ ఉన్నా పుష్ప 2 కోసం ఏకంగా 170 రోజుల దాకా రష్మిక డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మామూలుగా అయితే ఒక సినిమాకు 100 రోజులకు అటు ఇటుగా హీరోయిన్స్ డేట్స్ ఇస్తారు. కానీ రష్మిక ఈ సినిమాకు దగ్గర దగ్గర డబుల్ డేట్స్ ఇచ్చేసింది.

సినిమా పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్ వల్లే కెరీర్ లో రష్మిక అంతగా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. తనతో పనిచేసిన నిర్మాతలంగా కూడా మళ్లీ మళ్లీ రష్మికతో పనిచేయాలని అనిపించేలా చేస్తుంది. ఇక పుష్ప ఫ్రాంచైజ్ లో భాగంగా పార్ట్ 2 శ్రీవల్లి పాత్ర మెయిన్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. అసలే అల్లు అర్జున్ ఈ సినిమా రష్మిక ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాడు. సో రష్మిక ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక రేంజ్ ట్రీట్ అందిస్తుందని తెలుస్తుంది.

పుష్ప 2 సినిమాలో పుష్ప రాజ్ నటన గురించి ఎంతగా ఎదురుచూస్తున్నారో శ్రీవల్లి కోసం కూడా ఆమె ఫ్యాన్స్ అంతే ఆసక్తిగా ఉన్నారు. పుష్ప 2 తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న రష్మిక సినిమా బంపర్ హిట్ కొడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప 2 తో పాటు రష్మిక చేసే సినిమాలకు కూడా ఈ సినిమా ఇంపాక్ట్ పడుతుందని చెప్పొచ్చు.

సౌత్ నార్త్ అనే తేడా లేకుండా రష్మిక చేస్తున్న సినిమాలు ఆమె ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ అందిస్తున్నాయి. పుష్ప 2 విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న రష్మిక సినిమా ప్రమోషన్స్ లో తన కామెంట్స్ తో కూడా అంచనాలు పెంచేస్తుంది.