నేషనల్ క్రష్ కి పోటీ ఇప్పట్లో కష్టమేనా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో ఇప్పుడో సంచ లనం. `యానిమల్`, `పుష్ప` సినిమాలతోనే ఈ ఇమేజ్ సొంతమైంది.
By: Tupaki Desk | 22 Feb 2025 12:30 PM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో ఇప్పుడో సంచ లనం. `యానిమల్`, `పుష్ప` సినిమాలతోనే ఈ ఇమేజ్ సొంతమైంది. అందుకే బాలీవుడ్ లోనూ బిజీ నటిగా మారిపోయింది. ఇక `ఛావా` సక్సెస్ తో రష్మిక ఇమేజ్ తారా స్థాయికి చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంభాజీ మహారాజ్ భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక అభినయం ఓ అద్భుతం.
ఎంతో సెటిల్డ్ పెర్పార్మెన్స్ తో గొప్ప నటిగా ప్రూవ్ చేసుకుంది. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి అమ్మడు పరకాయ ప్రవేశం చేసే తీరు చూస్తే? తానెంత గొప్ప నటి అన్నది అర్ధమవుతుంది. `యానిమల్` రొమాంటిక్ రోల్..`పుష్ప` సినిమాలో మాస్ అప్పిరియన్స్ ...అంతకు ముందు చిత్రాల్లో పాత్రకు అనుగుణంగా అమ్మడు ట్రాన్సపర్మేషన్ ఇలా ప్రతీది రష్మిక డే బై డే ఎంత షైన్ అవుతుంది? అనడానికి తార్కాణంగా చెప్పొచ్చు.
ఇక ఏసుభాయి పాత్రతో నటనలో పీక్స్ కు చేరింది. ఈ విషయంలో బాలీవుడ్ నటి అలియాభట్ ని కూడా పక్కకు నెట్టేసిందనొచ్చు. రష్మిక ట్రాన్సపర్మేషన్ , పెర్పార్మెన్స్ చూస్తుంటే? ఇప్పట్లో అమ్మడికి పోటీగా మరో నటి తయారవ్వడం అన్నది అసాధ్యంగానే చెప్పాలి. బాలీవుడ్ లో అలియాభట్ ని బీట్ చేస్తుందనే ప్రచారం ఇప్పటికే ఉంది. `రామాయణం`లో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.
ఆ సినిమా రిలీజ్ తర్వాత తానెంత గొప్ప నటి అన్నది ప్రూవ్ అవుతుంది. అలా చూస్తే వస్తే పోటీగా సాయి పల్లవి రావాలి? తప్ప మరో నటికి ఆ ఛాన్స్ లేదన్నది కాదనలేని వాస్తవం. ఈలోగా రష్మిక మరిన్ని చిత్రాలతో పాన్ ఇండియాలో మరింత సంచలనమవుతుంది. ఇప్పటికే అమ్మడికి లేడీ ఓరియేంటెడ్ అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. కోట్ల రూపాయల పారితోషికం గుమ్మరించడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారు.