Begin typing your search above and press return to search.

వచ్చే ఏడాది సందడంతా అమ్మడిదేనా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న డిసెంబర్ సెంటిమెంట్ మరోసారి నిజమైంది. ఆమె హీరోయిన్ గా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది

By:  Tupaki Desk   |   28 Dec 2024 4:15 AM GMT
వచ్చే ఏడాది సందడంతా అమ్మడిదేనా?
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న డిసెంబర్ సెంటిమెంట్ మరోసారి నిజమైంది. ఆమె హీరోయిన్ గా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. లాస్ట్ ఇయర్ డిసెంబరులో అమ్మడి అకౌంట్ లో 'యానిమల్' లాంటి భారీ సక్సెస్ పడిన సంగతి తెలిసిందే. 2024లో ఆమె నుంచి ఒకే ఒక్క సినిమా 'పుష్ప 2'. కానీ 2025లో మాత్రం రష్మిక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

రష్మిక మందన్న హిందీలో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో 'ఛావా' అనే సినిమా చేస్తోంది. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు, మరాఠా వీరుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా ఈ ఎపిక్ హిస్టారికల్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆమె బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కు జోడీగా కనిపించనుంది. ఆల్రెడీ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ 'పుష్ప 2' కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వాయిదా వేసుకున్నారు.

కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'సికందర్' సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఎ.మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ డ్రామా 2025 ఈద్ స్పెషల్ గా విడుదల కానుంది. ఈ సినిమాకి మంచి హైప్ ఉంది. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' అనే బైలింగ్వల్ సినిమా చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'కుబేర' సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ధియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ లో 'థమా' అనే హార్రర్ కామెడీ మూవీలో రష్మిక నటిస్తోంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడు. 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలు తీసిన మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ లో ఈ మూవీ రూపొందుతోంది. 2025 దీపావళికి రిలీజ్ అవుతుంది.

ఇలా ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో ఐదారు క్రేజీ సినిమాలు ఉన్నాయి. రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న 'ధురంధర్' అనే సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్ర పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలానే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' మూవీలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు. దీంట్లో నేషనల్ క్రష్ ఉందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఏదేమైనా 'యానిమల్' 'పుష్ప 2' వంటి రెండు భారీ విజయాల తర్వాత రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిందని చెప్పాలి. 2025 లో చాలా రిలీజులు ఉన్నాయి కాబట్టి, వాటిల్లో కొన్ని హిట్టయినా అమ్మడి క్రేజ్ ఇంకా నెక్స్ట్ లెవల్ చేరుకుంటుందని అనడంలో సందేహం లేదు. మరి రాబోయే సంవత్సరంలో రష్మిక సందడి ఎలా ఉంటుందో చూడాలి.