Begin typing your search above and press return to search.

డీప్ ఫేక్ వీడియోపై రష్మిక యుద్ధం.. వీడియో వైరల్

డిసెంబర్ 6న ఈ హిస్టారికల్ బయోపిక్ మూవీ రిలీజ్ కాబోతోంది.

By:  Tupaki Desk   |   15 Oct 2024 10:57 AM GMT
డీప్ ఫేక్ వీడియోపై రష్మిక యుద్ధం.. వీడియో వైరల్
X

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతోంది. ‘యానిమల్’ మూవీ తర్వాత రష్మిక క్రేజ్ బాలీవుడ్ లో కూడా పెరిగింది. ఈ ఏడాది హిందీలో విక్కీ కౌశల్ ‘చావా’ సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. డిసెంబర్ 6న ఈ హిస్టారికల్ బయోపిక్ మూవీ రిలీజ్ కాబోతోంది. అదే రోజు మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప 2’ కూడా థియేటర్స్ లోకి రానుంది.

పుష్ప సినిమాతోనే రష్మిక పాన్ ఇండియా స్టార్ గా మారింది. రష్మిక నటించిన రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు పోటీ పడుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే చాలా మంది హీరోయిన్స్ కమర్షియల్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే రష్మిక మందన సోషల్ యాక్టివిటీస్ లో భాగం కావాలని డిసైడ్ అయ్యింది. సెలబ్రెటీలు సైబర్ క్రిమినల్స్ బారిన ఎక్కువ పడుతూ ఉంటారు. ముఖ్యంగా AI ఉపయోగించి సెలబ్రెటీల డీప్ ఫేక్ వీడియోలని క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.

గతంలో రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోపై చాలా మంది నటీనటులు రియాక్ట్ అయ్యారు. అలాంటి వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. రష్మిక ఆ వీడియోపై సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా తాన సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం అయినట్లు రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టింది.

నా డీప్ ఫేక్ వీడియో ఒకటి కొన్నాళ్లక్రితం వైరల్ అయ్యింది. అది ఒక సైబర్ క్రైమ్. అప్పటి నుంచి ఈ సైబర్ క్రైమ్స్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే అలాంటి సైబర్ నేరాలపైన అవగాహన కల్పించాలని డిసైడ్ అయ్యాను. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో నడిచే సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను.

దీని ద్వారా క్రైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాను. ఈ సైబర్ క్రిమినల్స్ అందరిని ఏదో ఒక రూపంలో టార్గెట్ చేస్తారు. వారి ఉచ్చులో చిక్కకుండా మనం నిరంతరం అలెర్ట్ గా ఉండాలి. మనల్ని మనం వారి నుంచి కాపాడుకోవాలి. అలాగే ఈ సైబర్ క్రైమ్స్ బారిన ఎవరూ పడకుండా చూడాలి. నేను నా బాధ్యతగా ఇకపై ఈ సైబర్ నేరాలపై అందరిని చైతన్య పరిచే ప్రయత్నం చేస్తాను. దేశాన్ని ఈ నేరగాళ్ల చేతిలోంచి కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటూ రష్మిక వీడియో పోస్ట్ పెట్టింది. ఈ వీడియోకి నెటిజన్లు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.