యానిమల్ పార్క్ గురించి రష్మిక మాటలు..!
నిర్మాత చెప్పినట్లుగా 2025 ద్వితీయార్థంలో యానిమల్ పార్క్ ప్రారంభం కాబోతుంది. తాజాగా ఆ సినిమాపై హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 12 Dec 2024 8:30 AM GMTగత ఏడాది డిసెంబర్‌లో యానిమల్ సినిమాతో, ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప 2 తో పాన్ ఇండియా స్థాయి భారీ విజయాలను సొంతం చేసుకున్న లక్కీ లేడీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈరెండు సినిమాల్లోనూ చాలా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఇలా దక్కడం, అవి ఇంతటి భారీ విజయాలను సొంతం చేసుకోవడం హీరోయిన్స్‌కి చాలా అరుదుగా దక్కుతూ ఉంటాయి అనడంలో సందేహం లేదు. రష్మిక లక్ బాగుండి ఇంత భారీ సినిమాలు దక్కాయి, అందులో తన పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండటం మరింత అదృష్టంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేసింది. ముందు ముందు బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాల్లోనూ తన జర్నీ సాగబోతుందని చెప్పుకొచ్చింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇంకా షూటింగ్ మొదలు కాని ఆ సినిమా తర్వాత సందీప్ యానిమల్ పార్క్‌ను చేయబోతున్నాడు. నిర్మాత చెప్పినట్లుగా 2025 ద్వితీయార్థంలో యానిమల్ పార్క్ ప్రారంభం కాబోతుంది. తాజాగా ఆ సినిమాపై హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక మందన్న మరోసారి యానిమల్ పార్క్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయమై స్పందిస్తూ యానిమల్ పార్క్ అంతకు మించి అంటూ పిచ్చెక్కించడం ఖాయం అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. యానిమల్ పార్క్ విషయంలో తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా ఆమె పేర్కొంది. అంతే కాకుండా సినిమా షూటింగ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆమె తెలియజేసింది.
రష్మిక మందన్న త్వరలో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా టీజర్ ఇటీవలే విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల అయ్యింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆమధ్య సుకుమార్ మాట్లాడుతూ గర్ల్ ఫ్రెండ్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూశాను, చాలా బాగున్నాయి. సినిమాకు అద్భుతంగా స్పందన వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.