Begin typing your search above and press return to search.

అదే జరిగితే రష్మికకు ఇంక తిరుగుండదు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటోంది.

By:  Tupaki Desk   |   31 Oct 2024 8:15 AM GMT
అదే జరిగితే రష్మికకు ఇంక తిరుగుండదు!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల కాలంలో హిందీ చిత్ర పరిశ్రమ మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఇందులో భాగంగా లేటెస్టుగా దీపావళి సందర్భంగా ''థమా'' అనే తన న్యూ మూవీ అనౌన్స్ మెంట్ తో వచ్చింది.

'థమా' చిత్రం దినేష్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌ లో భాగంగా తెరకెక్కుతోంది. ఇదొక రక్త పిశాచ ప్రేమకథ అని మేకర్స్ తెలిపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా రష్మిక మందన్న కనిపించనుంది. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి పాపులర్ స్టార్స్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘భేడియా’ ఫేమ్ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 2025 దీపావళికి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే కొన్ని హిందీ సినిమాలతో ఆకట్టుకునే రష్మిక మందన్నకు, 'థమా' చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇది ఆమె కెరీర్ లోనే ఫస్ట్ హారర్ కామెడీ మూవీ. అందులోనూ దినేష్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌లో రూపొందే చిత్రమిది. ఇంతకముందు ఈ క్రియేటర్స్ నుంచి వచ్చిన 'స్త్రీ', 'ముంజ్యా', 'భేడియా' చిత్రాలు బ్లాక్‌ బస్టర్ విజయాలను అందుకున్నాయి. 'స్త్రీ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

శ్రద్ధా కపూర్, రాజ్ కపూర్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ 'స్త్రీ 2'. దాదాపు ₹100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, ఏకంగా ₹875 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా, అత్యధిక గ్రాస్ వసూలు చేసిన హిందీ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే యూనివర్స్‌లో వ్యాంపైర్ లవ్ స్టోరీగా 'థమా' మూవీ తెరకెక్కుతోంది. ఇది హిట్టయితే శ్రద్ధా మాదిరిగానే రష్మిక క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కు వెళ్లే ఛాన్స్ ఉంది.

‘గుడ్‌ బై’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక.. ‘యానిమల్’ మూవీతో తొలిసారిగా ₹500 కోట్ల క్లబ్ రుచి చూసింది. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఈ సినిమా.. ₹900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దాంట్లో హిందీ వెర్షన్ ₹490 కోట్లు రాబట్టింది. ఇక అల్లు అర్జున్ సరసన ఆమె హీరోయిన్ గా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా ఈజీగా ₹1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

రష్మిక ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికిందర్' సినిమాలో ఫీమేల్ లీడ్ ప్లే చేస్తోంది. వచ్చే ఏడాది ఈద్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కూడా ₹500 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఇండియన్ సినిమాలో హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి, 'థమా' చిత్రం సైతం 500 కోట్ల క్లబ్ ను టచ్ చేస్తుందని అంచనా వేయొచ్చు. ఇలా రష్మిక నటిస్తున్న సినిమాలన్నీ వందల కోట్లు కొల్లగొట్టే పొటెన్షియల్ కలిగి ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే, అమ్మడికి ఇంక తిరుగుండదు. పాన్ ఇండియా స్థాయిలో టాప్ హీరోయిన్ గా రాణించే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.