Begin typing your search above and press return to search.

రష్మిక 2024.. నెం.1 హీరోయిన్ గా సెండాఫ్!

కిర్రిక్ పార్టీ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక.. ఛలో మూవీతో టాలీవుడ్ లోకి వచ్చారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

By:  Tupaki Desk   |   22 Dec 2024 7:38 AM GMT
రష్మిక 2024.. నెం.1 హీరోయిన్ గా సెండాఫ్!
X

రష్మిక మందన్న.. పాన్ ఇండియా స్థాయిలో టాప్ హీరోయిన్ ఎవరంటే చాలా మంది ఆమె పేరునే కచ్చితంగా చెప్తారన్న విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తన అందం, అభినయంతో వేరే లెవెల్ లో మెప్పిస్తున్న రష్మిక.. వరుస అవకాశాలు అందుకుంటున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

కిర్రిక్ పార్టీ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రష్మిక.. ఛలో మూవీతో టాలీవుడ్ లోకి వచ్చారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్ గా మారిపోయారు. పాన్ ఇండియా రేంజ్ లో తన ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు.

యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని 2023ను ముగించిన రష్మిక.. ఇప్పుడు వేరే లెవెల్ హిట్ తో 2024కు సెండాఫ్ ఇస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2: ది రూల్ తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక.. అదిరిపోయే హిట్ ను సొంతం చేసుకున్నారు. శ్రీవల్లి 2.0గా అందరినీ మెప్పించారు.

తన అద్భుతమైన యాక్టింగ్ తో సర్వత్రా ప్రశంసలు అందుకున్న రష్మిక.. అన్ని భాషల్లో తన సత్తా ఏంటో చూపించారు. అగ్ర కథానాయికగా ఆమె స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకున్నారు. అలా పుష్ప-2 విజయంతో 2024లో రష్మిక క్రేజ్ మరో ఎత్తుకు చేరిందని చెప్పాలి. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీని రష్మిక ఏలడం పక్కా!

అయితే రష్మిక.. ప్రస్తుతం తన కెరీర్ లో హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నారు. త్వరలో మరిన్ని పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సందడి చేయనున్నారు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆ సినిమా టీజర్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతోపాటు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరలో కూడా యాక్ట్ చేస్తున్నారు రష్మిక. తమిళ, తెలుగు మూవీ రెయిన్ బోలో నటిస్తున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ లో హీరోయిన్ గా కనిపించనున్న రష్మిక.. చావా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. అలా వచ్చే ఏడాది వివిధ సినిమాలతో థియేటర్లలో రానున్నారు నేషనల్ క్రష్. మొత్తానికి 2024ను హిట్ తో ముగించిన అమ్మడు.. 2025లో ఫుల్ గా సందడి చేయనుండడం పక్కా.