శ్రీవల్లి జోరు.. పార్ట్ 1 కి రూ.2 కోట్లు, పార్ట్ 2 కి రూ.10 కోట్లు?
పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లిగా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 1 Dec 2024 6:26 AM GMTపుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లిగా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల ఒక చిట్ చాట్‌లో తన 8 ఏళ్ల సినీ కెరీర్‌లో అయిదు సంవత్సరాలు పుష్ప సినిమా కోసం వర్క్ చేసినట్లుగా చెప్పింది. మరో రెండేళ్లు పుష్ప 3 సినిమా కోసం ఈమె వర్క్ చేయాల్సి రావచ్చు. మొత్తానికి పుష్ప సినిమా కోసం శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న చేస్తున్న హడావిడి సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో రష్మిక మందన్న ఓ రేంజ్‌లో సందడి చేస్తూ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప కారణంగా గుర్తింపు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.
పుష్ప మొదటి పార్ట్ కోసం రష్మిక మందన్న రూ.2 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం రష్మిక ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందుకుంది అనే వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం రూ.౧౫౦ కోట్ల పారితోషికం తీసుకోగా, దర్శకుడు సుకుమార్ సైతం రికార్డ్ స్థాయి పారితోషికం తన ఖాతాలో వేసుకున్నాడు. హీరోయిన్ రష్మిక మందన్న సైతం ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందుకోవడం జరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ప్రస్థావిస్తే అంతా నిజం కాదని, పుకార్లు నమ్మవద్దు అంటూ నవ్వేసింది. ఆమె నో అన్నా పుష్ప 2 కోసం రష్మిక తీసుకున్న పారితోషికం తక్కువ కాదని ప్రతి ఒక్కరు అంటున్నారు.
దాదాపు రెండేళ్ల పాటు పుష్ప 2 సినిమా కోసం డేట్లు కేటాయించింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయాలని భావించి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత పుష్ప 2 సినిమా కోసం ఎక్కువ డేట్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమాను క్యాన్సల్ చేసుకుంది. నితిన్ సినిమా మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలను సైతం రష్మిక మందన్న పుష్ప 2 సినిమా కోసం క్యాన్సల్ చేసుకుంది. అందుకు పుష్ప 2 సినిమా కోసం ఆమెకు రూ.10 కోట్ల పారితోషికం ఎక్కువ ఏం కాదని అంతా భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు రష్మిక మందన్నకు ఇచ్చిన పారితోషికం సౌత్‌లోనే అత్యధికం అనే టాక్ వినిపిస్తూ ఉంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార నాలుగు నుంచి ఆరు కోట్ల రూపాయల పారితోషికంను అందుకుంటూ ఉంటుంది. ఇతర హీరోయిన్స్ సైతం అటు ఇటుగా మూడు నుంచి అయిదు కోట్ల పారితోషికం అందుకుంటారు. కానీ రష్మిక మందన్న ఏకంగా బాలీవుడ్ ముద్దుగుమ్మల స్థాయిలో ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందుకోవడం ద్వారా తన స్టార్‌డమ్‌ను నిలుపుకుంది. ఇక మీదట రష్మిక తన ప్రతి సినిమాకు అదే స్థాయిలో పారితోషికం తీసుకుంటుందా అంటే సాధ్యం కాకపోవచ్చు.. కానీ తదుపరి సినిమాలకు ఈమె రూ.5 కోట్లకు పైగానే పారితోషికంగా అందుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు మాట్లాడుకుంటూ ఉన్నారు. రష్మిక మందన్న వచ్చే ఏడాది మరో రెండు బాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.