పుష్ప 3లో VD… రష్మిక ఏం చెప్పిందంటే?
అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ ప్రచారం పై స్పందించింది.
By: Tupaki Desk | 15 Dec 2024 7:01 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘పుష్ప 2’కి దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. వరుసగా రికార్డులని బ్రేక్ చేసుకుంటూ ఈ మూవీ వసూళ్లు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 1100 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. కల్కి 2898ఏడీ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ని ఈ మూవీ అడుగుదూరంలో ఉంది. కచ్చితంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1500 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లని అందుకుంటుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పుష్ప 3’ కూడా ఉండబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో కూడా సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ పార్ట్ 3లో జగపతిబాబు మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడని ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ లేదు. కానీ ‘పుష్ప 3’ వస్తే మాత్రం అన్ని రికార్డులని తిరగరాస్తుందని అనుకుంటున్నారు.
అల్లు అర్జున్ మరో మూడేళ్ళ సమయం కేటాయిస్తే ఆ మూవీ కంప్లీట్ చేస్తామని సుకుమార్ చెప్పారు. అయితే బన్నీ మాత్రం ఈ సినిమా చేయడానికి కొంత టైం తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమాలు పూర్తి చేసాక ‘పుష్ప 3’ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కనిపించాబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.
మూడో పార్ట్ లో విజయ్ ని సుకుమార్ విలన్ గా చూపించబోతున్నాడని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ ప్రచారం పై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి ఆ విషయంలో ఎలాంటి సమాచారం లేదని చెప్పింది. తాను కూడా ఈ న్యూస్ చూస్తున్నానని, అయితే స్పష్టత లేదని రష్మిక చెప్పుకొచ్చింది.
ప్రేక్షకులతో పాటు టీమ్ కి కూడా సర్ప్రైజ్ ఇవ్వడం సుకుమార్ కి చాలా ఇష్టమని అన్నారు. అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘పుష్ప 3’లో నటిస్తే మాత్రం కచ్చితంగా దానికి నెక్స్ట్ లెవల్ హైప్ వస్తుంది. ఐకాన్ స్టార్ ఇమేజ్ కి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా తోడైతే ఇండియా మొత్తాన్ని ఆ మూవీ షేక్ చేస్తుందని అనుకుంటున్నారు.