రష్మిక వర్సెస్ సాయి పల్లవి ఎవరు నెంబర్ -1?
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా? బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి ఇండస్ట్రీని ఎలా ఏల్తున్నారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 12 Feb 2025 11:30 AM GMTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా? బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి ఇండస్ట్రీని ఎలా ఏల్తున్నారు? అన్నది చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకొస్తున్న అవకాశాలు...అందుకుంటోన్న సక్సెస్ లు చూస్తుంటే? వాళ్ల పనితనం అర్దమవుతుంది. ఇద్దరు హీరోయిన్లుగా బిజీ బిజీగా ఉన్నారు. తెలుగు తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు కోలీవుడ్ ని కూడా టచ్ చేస్తున్నారు. మరి ఇద్దరి లో నెంబర్ వన్ ఎవరు? అంటే చెప్పడం కష్టమే.
కానీ ఈ వరుసలో సాయి పల్లవి కంటే రష్మిక కాస్త మెరుగైన స్థానంలో కనిపిస్తుంది. `యానిమల్` ,` పుష్ప` విజయాలతో రష్మిక పాన్ ఇండియాలో సంచలనమైంది. రెండు భారీ విజయాలు సాధించాయి. వందల కోట్ల వసూళ్లను సాధిం చాయి. ఆ సినిమాలకు గానూ రష్మిక కూడా భారీగానే పారితోషికం తీసుకుంది. హిందీలో స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటుంది. గ్రేట్ పెర్పార్మర్ గా విమర్శకుల ప్రశంసలందుకుంటుంది.
ఇలా రష్మిక కెరీర్ ఎలాంటి అలజడులు లేకుండా సాగిపోతుంది. అలాగని సాయి పల్లవి తక్కువేం కాదు. వచ్చిన ఎన్నో అవకాశాల్ని కాదనుకుని సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. రష్మిక లా గ్లామర్ గేట్లు ఓపెన్ చేస్తే అవకాశాల పరంగా రష్మికనే మించిపోతుంది. అందులో ఎలాంటి డౌట్లేదు. కానీ తనకంటూ కొన్ని పరిమితులు విధించుకుని ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతుంది. అయినా గొప్ప గొప్ప అవకాశాలు సాయి పల్లవిని వెతుక్కుంటూ వస్తున్నాయి.
ఇటీవలే `తండేల్` తో పాన్ ఇండియాలో కి అడుగు పెట్టింది. ఈసినిమా మంచి విజయం సాధించింది. ఇక బాలీవుడ్ డెబ్యూ లో ఏకంగా రామాయణం ఇవ్వడం గొప్పవిషయం. దర్శకుడు నితీష్ తివారీ ఇండియాలో హీరోయిన్లు అందర్నీ పక్కనబెట్టి మరీ సీత పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేసాడు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ లో తాను ప్రయత్నించకుండానే వచ్చిన గొప్ప అవకాశం ఇది. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి ఉత్తరాదినా వెలిగిపోతుందని భారీ అంచనాలున్నాయి.