Begin typing your search above and press return to search.

ఏజ్ గ్యాప్ జంట.. ఈ డిస్కషన్ ఎందుకంట..?

ఐతే సినిమా ఎంత ఇష్టం ఉన్నా మిమీరిన అబ్సర్వేషన్ అనేది అనవసరమని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 4:58 PM GMT
ఏజ్ గ్యాప్ జంట.. ఈ డిస్కషన్ ఎందుకంట..?
X

సినిమా తెర మీద కనిపించే పాత్రలు వాటి స్వభావాలు కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. టికెట్ కొన్న ప్రేక్షకుడు ఒక సినిమాకు ఎంటర్టైన్ అయ్యేలా చేయగలిగితే చాలు ఆ సినిమా సక్సెస్ అయినట్టే లెక్క. ఇక్కడ ప్రేక్షకులు వారి వారి ఆలోచనలకు, అభిరుచులకు తగినట్టుగా సినిమాలను ఎంపిక చేసుకుని చూస్తుంటారు. ఐతే సినిమా ఎంత ఇష్టం ఉన్నా మిమీరిన అబ్సర్వేషన్ అనేది అనవసరమని చెప్పొచ్చు.

ఒక సినిమా చూశామా ఆ తర్వాత మన పని మనం చూసుకున్నామా అన్నట్టు ఉంటే బాగుంటుంది. ఐతే కొన్ని సినిమాలు జీవితాన్ని చెబుతాయి.. అలాంటి వాటి నుంచి కొంత స్పూర్తి పొందొచ్చు. ఐతే కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివి చాలా కష్టం అందుకే వారు మిగతా విషయాల పట్ల దృష్టి పెడుతుంటారు. అలాంటి వాటిల్లోనే ఒకటి హీరో హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్. స్టార్ హీరోలు సీనియర్ హీరోలకు వారితో నటించే కథానాయికల ఏజ్ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ ఏజ్ తో దాదాపు 20, 30 ఏళ్ల ఏజ్ గ్యాప్ కూడా ఉంటుంది.

ఐతే ఏజ్ గ్యాప్ ఉన్న హీరోలతో నటించే హీరోయిన్స్ కు ఎక్కడో ఒకచోట క్రిటిసిజం ఉంటుంది. దానికి వారు బాధ్యులు కాకపోయినా అందరి టార్గెట్ వారే అవుతుంటారు. ప్రస్తుతం అలాంటి కండిషన్ లోనే ఉన్నారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న. సల్మాన్, రష్మికల మధ్య దాదాపు 31 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. దాన్ని చూపిస్తూ అంత ఏజ్ గ్యాప్ ఉన్న ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారా అని కొందరు మాట్లాడుతున్నారు.

సినిమాలో హీరో హీరోయిన్ తప్ప వారు బయట నిజంగానే జత కట్టరు. కేవలం వారి పాత్రలను చూసి సినిమా నచ్చితే సూపర్ అనుకోవాలి తప్ప. తెర మీద వారి పాత్రల మధ్యలోకి వారి రియల్ ఏజ్ ని తెచ్చి వేరేలా చూడకూడదు. ఇది కేవలం సల్మాన్ రష్మిక విషయంలోనే కాదు తెలుగు స్టార్ సినిమాల విషయంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది.. జరుగుతూనే ఉంది. ఎవరేం కామెంట్స్ చేసినా ప్రొఫెషనల్ గా యాక్టర్, యాక్ట్రెస్ అయినప్పుడు తమ పాత్రకు తగినట్టుగా ఎవరితో అయినా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ కామెంట్స్ ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.