రష్మిక వల్ల అల్లు అర్జున్‌కి గాయం...!
ఆ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఘటన గురించి తాజాగా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.
By: Tupaki Desk | 27 Dec 2024 10:09 AM GMTఅల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబోలో రూపొందిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే రూ.1700 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మరో వారం పది రోజుల్లో బాహుబలి 2 రికార్డ్‌లను బ్రేక్ చేయడం ఖాయం అనే నమ్మకంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ సైతం ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ.2000 కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయం అని నమ్మకం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. పుష్ప 2 సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ దక్కడంతో రికార్డ్ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి, ఇంకా వసూళ్లు కంటిన్యూ అవుతున్నాయి. ముందు ముందు ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకులను అలరించింది, ఆకట్టుకుంది. అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాటలన్నింటిలోకి పీలింగ్స్ పాట అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఘటన గురించి తాజాగా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. రష్మిక మందన్న మాట్లాడుతూ... పీలింగ్స్ పాటను అయిదు ఆరు రోజుల పాటు చిత్రీకరణ చేశాం. ఎక్కువ రోజులు పాట కోసం ప్రాక్టీస్ చేశాం. సినిమా కోసం చాలా స్పీడ్‌గా డాన్స్ చేస్తున్న సమయంలో తన చేతి గాజులు, కంకణం బన్నీకి తగిలింది అంది.
ఇద్దరం చాలా స్పీడ్‌గా డాన్స్ చేస్తున్న సమయంలో నా చేతికి ఉన్న గాజులు, కంకణం గట్టిగా బన్నీకి తగిలాయి. దాంతో ఆయనకు రక్తం వచ్చింది. ఆ సమయంలో నాకు చాలా బాధ అనిపించింది. తన వల్ల బన్నీకి రక్తం వచ్చేంత గాయం అయ్యింది. ఆయనకు వెంటనే బాండేజ్ కట్టాము. అయినా తాను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారూ. ఆయనకు క్షమాపణలు చెప్పిన సమయంలో ఇలాంటివి చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. దానికి ఇంత బాధ పడాల్సింది ఏముంది అంటూ ఆయన పర్లేదు అంటూ వెంటనే డాన్స్‌కి రెడీ అయ్యారు. ఆయన కమిట్‌మెంట్, ఆయన పట్టుదల అలాంటిది అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.
సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్లు రికార్డ్ స్థాయిలో రాబడుతున్నా ఇప్పటి వరకు కనీసం ఒక్క సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో బన్నీ అండ్ టీం ఉన్నారు, రేవతి మృతి చెందడంతో పాటు ఆమె బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందుకే వేడుకలకు దూరంగా ఉన్నారు. అల్లు అర్జున్ తో పాటు పుష్ప 2 యూనిట్ సభ్యులు అంతా కలిసి శ్రీతేజ్ కోసం ఏకంగా రూ.2 కోట్ల ఆర్థిక సాయంను ప్రకటించారు. పలువురు రేవతి కుటుంబంకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు.