భావోద్వేగాలతో శ్రీవల్లి ఉక్కిరిబిక్కిరి
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 1లో రష్మిక పాత్ర పరిధి తక్కువ, నటించే స్కోప్ ఎక్కువ సీన్స్‌లో లేదు.
By: Tupaki Desk | 5 Dec 2024 4:48 AM GMTఅల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప 1లో రష్మిక పాత్ర పరిధి తక్కువ, నటించే స్కోప్ ఎక్కువ సీన్స్‌లో లేదు. కానీ పుష్ప 2లో ఆమె సత్తా చాటింది. సినిమా కథ ఎక్కువగా ఆమె చుట్టూ తిరుగుతుందని మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే పుష్ప 2 లో రష్మిక మందన్న పాత్ర, ఆమె నటన గురించి ప్రధానంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రీవల్లి పవర్‌ను పుష్ప 2లో చూపించారు అంటూ రివ్యూవర్స్ సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
పుష్ప శ్రీవల్లి పాత్ర కోసం రష్మిక మందన్న ఐదేళ్ల టైం స్పెండ్ చేసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడు ఎనిమిది ఏళ్లు అవుతున్న రష్మిక మందన్న ఈ సినిమా కోసం ఐదేళ్ల పాటు వర్క్ చేయడం అరుదైన విషయం. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రష్మిక చెప్పుకొచ్చింది. సినిమా కోసం తన సుదీర్ఘ జర్నీ గురించి వివరిస్తూ, చిత్ర యూనిట్ సభ్యుల గురించి ఆమె సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేయడం జరిగింది. ఆమె ఇన్‌స్టాలో పుష్ప షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోలను షేర్ చేయడంతో పాటు భావోద్వేగాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా పేర్కొంది.
పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది అనగా రష్మిక మందన్న సోషల్ మీడియా ద్వారా పలు ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేయడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మిక... పుష్ప 2 రేపు విడుదల కాబోతున్న ఈసమయంలో నేను భావోద్వేగాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. ఈ యూనిట్‌తో తాను వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యాను. ఒక సినిమా విడుదల సమయంలో తాను ఎప్పుడూ అనుభవించని భావోద్వేగాలను అనుభవిస్తున్నాను. పుష్పలో నా జర్నీ 2021లో ప్రారంభం అయ్యింది. పుష్ప సెట్స్‌లో అడుగు పెట్టడానికి ముందు చిత్తూరు యాస ట్రైనింగ్ ఇవ్వడానికి టీం మా ఇంటికి వచ్చింది ఇంకా నాకు బాగా గుర్తు ఉంది.
సుక్కు సార్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయనతో మాట్లాడేందుకు భయపడ్డ రోజుల నుంచి ఆయనతో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. షాట్ బాగానే ఉందా అని ఆయన్ను అడగడానికి నేను ఎప్పుడూ చూస్తూ ఉండేదాన్ని. మైత్రి మూవీ మేకర్స్ నాకు హోం బ్యానర్. వారు నా నుంచి డేట్ల కోసం పొట్లాడటం మొదలుకుని, నా ప్రతి విషయంలోనూ వారు చూపించిన శ్రద్ద గురించి ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి వ్యక్తులతో వర్క్ చేసినందుకు గర్వంగా ఉంది. మనం ఎలా ప్రారంభించినా మనం రోజూ ఎలా ఉన్నా చివరి ఫలితం కోసం ఆసక్తిగా చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయడం వల్ల విజయం నేడు దక్కబోతుంది' అంటూ రష్మిక పోస్ట్ చేసింది.