ట్రోలర్స్ కు రష్మిక స్ట్రాంగ్ రిప్లై!
ఈ నేపథ్యంలో రష్మిక దూకుడుగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
By: Tupaki Desk | 1 Dec 2024 8:30 PM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ''పుష్ప 2: ది రూల్''. 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా కనిపించనుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రష్మిక దూకుడుగా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
‘పుష్ప’ సెట్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు అల్లు అర్జున్ ఎదురుగా నిల్చున్నా, పుష్పరాజ్ గెటప్ లో ఉండటంతో అసలు గుర్తుపట్టలేకపోయానని రష్మిక తెలిపింది. శ్రీవల్లి గెటప్‌లో మేకప్ లేకుండా ఉన్న తనను కూడా ఎవరూ గుర్తుపట్టేవారు కాదని చెప్పింది. కొందరైతే నేరుగా తన దగ్గరకే వచ్చి రష్మిక ఎక్కడ అని అడిగేవారట. ఇక తనకు డిసెంబర్ నెల అంటే చాలా సెంటిమెంట్ అని చెబుతోంది రష్మిక. హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ‘కిరాక్ పార్టీ’ సినిమా.. ‘అంజనీపుత్ర’, ‘చమక్’ సినిమాలు డిసెంబర్‌లోనే వచ్చి విజయం సాధించాయి. నేషనల్ వైడ్ గా పాపులారిటీ తెచ్చిపెట్టిన ‘పుష్ప: ది రైజ్’, ‘యానిమల్’ చిత్రాలు సైతం ఇదే నెలలో వచ్చాయని.. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా హిట్ అవుతుందని నమ్ముతోంది.
‘యానిమల్’ మూవీలో హీరో రణ్‌బీర్ కపూర్ ను కొట్టే సీన్ తనకి ఛాలెంజింగ్ గా అనిపించిందని రష్మిక తెలిపింది. ఆ సీన్ లో ఎమోషన్స్ స్ట్రాంగ్ గా పండాలని, చాలా నేచురల్ గా ఉండాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పారట. యాక్షన్ అని అనగానే రణ్ బీర్ మీద కేకలు వేస్తూ, అతడి చెంప మీద చెళ్లుమనిపించిందట. షాట్ ఓకే అని డైరెక్టర్ చెప్పినా కన్నీళ్లు మాత్రం ఆగలేదని.. బాగా ఏడ్చేశానని రష్మిక చెప్పింది. దాదాపు 8 నిమిషాల ఆ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో పూర్తి చేసినట్లుగా తెలిపింది.
‘యానిమల్’ సినిమా రిలీజైన తర్వాత తనను చాలా రకాలుగా ట్రోల్ చేసారని రష్మిక అంటోంది. ఒక సీన్ లో తన ఎక్స్‌ప్రెషన్ బాగాలేదని సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శించారని.. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచీ తాను ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉన్నానని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో ఇలాంటివి చూసి చాలా బాధపడేదాన్నని చెప్పింది. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుందని.. అది మితిమీరితే మాత్రం తన స్టైల్‌లో ఘాటుగా రిప్లై ఇస్తానని చెప్పింది.
చిన్నతనంలో తన ఫ్యామిలీ పేదరికం అనుభవించినట్లుగా రష్మిక మందన్న చెబుతోంది. నాన్న చేసిన బిజినెస్ దెబ్బతినడంతో ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోయాం. కొన్నేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో ఇంటిని నడపడానికి నాన్న చాలా కష్టపడ్డారు. ఇంటి అద్దె కూడా కట్టలేని పొజిషన్ కి వచ్చేశాం. ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ ఒత్తిడి చేసేవారు. రెంట్ కట్టలేక ప్రతీ రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారుతూనే ఉండేవాళ్లమని చెప్పింది. ఇక సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా, వర్కవుట్స్ మాత్రం అస్సలు మిస్సవ్వనని అంటోంది. మామూలుగానే తనకు జర్నీ చేయడమంటే ఇష్టమని, కాస్త విరామం దొరికితే హాలిడేకి వెళ్తుంటానని చెప్పుకొచ్చింది.